త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

YS Jagan | మ‌హిళా బిల్లును అడ్డుకుని ఏం సాధించారు?.. విప‌క్షాలు ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి: వైఎస్ జ‌గ‌న్‌

YS Jagan |మ‌హిళా రిజ‌ర్వేన్ బిల్లును (Women's Reservation Bill) అడ్డుకున్న పార్టీలు తాము ఏం సాధించామో నిశితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) అన్నారు.

G

National | Published On Apr 18, 2026, 7.04 am IST

YS Jagan | మ‌హిళా బిల్లును అడ్డుకుని ఏం సాధించారు?.. విప‌క్షాలు ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి: వైఎస్ జ‌గ‌న్‌
Advertisement

YS Jagan | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హిళా రిజ‌ర్వేన్ బిల్లును (Women's Reservation Bill) అడ్డుకున్న పార్టీలు తాము ఏం సాధించామో నిశితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన (Constituency Redivision Bills) ద్వారా ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదలను విప‌క్షాలు (Opposing Parties) ఆమోదించి ఉంటే, దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లూ పెరిగేవ‌ని చెప్పారు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదం పొందేద‌ని తెలిపారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకోవ‌డంతో దేశంలో మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకూ న్యాయం దక్కలేదన్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింద‌ని, మహిళా రిజర్వేషన్‌ బిల్లు వాయిదా పడింద‌ని తెలిపారు. ఒకవేళ 2026 జనాభా లెక్కలే అమలైతే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదల విధానంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగేవని చెప్పారు. అదే 2011 జనాభా లెక్కలను ప్రాతిప‌దిక‌గా తీసుకుంటే దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయ‌న్నారు. ఇక 2026 జనాభా లెక్కలు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింతగా దిగజారుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసినందుకు జనాభా పెరుగుదల తగ్గిన దక్షిణాది రాష్ట్రాలు మరింతగా నష్టపోతాయ‌న్నారు.

50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లు 26 సీట్లకు పెరుగుతాయ‌ని, అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఆ సంఖ్య 24 మాత్రమే అవుతుంద‌న్నారు. అంటే రెండు సీట్లు నష్టపోవాల్సి ఉంటుంద‌ని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లు 38 సీట్లకు పెరుగుతాయ‌ని, 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే 34 సీట్లే అవుతాయ‌ని, 4 సీట్లు న‌ష్ట‌పోవాల్సి ఉంటుంద‌ని వెల్ల‌డించారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో జ‌రిగే న‌ష్టాన్ని గ‌ణాంకాలతో స‌హా వివ‌రించారు.

Advertisement
Advertisement