త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Bengal Elections | పశ్చిమబెంగాల్‌లో రెండో దశ ఎన్నిక‌లు.. 142 స్థానాల్లో పోలింగ్ 

West Bengal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో రెండో ద‌శ ఎన్నిక‌ల (West Bengal Elections) పోలింగ్ ప్రారంభ‌మైంది. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఓటింగ్ (Phase 2 Polling) సాగ‌నుంది. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్‌లో ఏప్రిల్ 23న మొద‌టి ద‌శ‌లో భాగంగా 152 సీట్ల‌లో పోలింగ్ నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం మిగిలిన 142 స్థానాల్లో పోలింగ్ జ‌రుగుతున్న‌ది.

G

National | Published On Apr 29, 2026, 7.15 am IST

West Bengal Elections | పశ్చిమబెంగాల్‌లో రెండో దశ ఎన్నిక‌లు.. 142 స్థానాల్లో పోలింగ్ 
Advertisement

West Bengal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో రెండో ద‌శ ఎన్నిక‌ల (West Bengal Elections) పోలింగ్ ప్రారంభ‌మైంది. ఉద‌యం 7 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఓటింగ్ (Phase 2 Polling) సాగ‌నుంది. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్‌లో ఏప్రిల్ 23న మొద‌టి ద‌శ‌లో భాగంగా 152 సీట్ల‌లో పోలింగ్ నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం మిగిలిన 142 స్థానాల్లో పోలింగ్ జ‌రుగుతున్న‌ది. రెండో విడుత‌లో మొత్తం 1,448 మంది అభ్య‌ర్థులు పోటీప‌డుతున్నారు. వీరి భ‌విత‌వ్యాన్ని3,21,73,837 మంది ఓట‌ర్లు తేల్చ‌నున్నారు. ఇందులో 1,64,35,627 మంది పురుషులు, 1,57,37,418 మంది మహిళలు, 792 మంది ట్రాన్స్​జెండర్లు ఉన్నారు. వీరికోసం 41 వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

మే 4న ఫలితాలు

ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. అత్యధికంగా కోల్‌కతాలో 273 కంపెనీల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేసింది. మొదటి విడతలో రికార్డు స్థాయిలో 93.19 శాతం ఓటింగ్‌ నమోదైంది. రెండో విడతలోనూ భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. మే 4న బెంగాల్‌తో పాటు అస్సాం, కేరళం, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

టీఎంసీ కంచుకోట‌లు..

కాగా, ప్ర‌స్తుతం తృణమూల్‌ కాంగ్రెస్‌కు (TMC) కంచుకోటలైన ఉత్తర 24 పరగణాలు (33 సీట్లు), దక్షిణ 24 పరగణాలు (31 సీట్లు), హౌరా (16), నదియా (17), హుగ్లీ (18), పూర్బా బర్ధమాన్ (16), కోల్‌కతా (11 సీట్లు) జిల్లాల్లో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. 2021 శాసనసభ ఎన్నికల్లో ఈ 142లో 123 చోట్ల టీఎంసీ గెలవగా 18 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో ఐఎస్‌ఎఫ్ విజ‌యం సాధించాయి. అయితే పలు చోట్ల బీజేపీ కొద్దిపాటి తేడాతో ఓడిపోయింది. 14 సీట్లలో కేవలం 10వేల తేడాతో ఓడిపోతే, 50 సీట్లను 25 వేల తేడాతో కోల్పోయింది. దీంతో ఆయా స్థానాల్లో మ‌రింత ప‌ట్టు సాధించింది. దీంతో ఇరుపార్టీల మ‌ధ్య ఈ సారి గ‌ట్టి పోటీ నెల‌కొన్న‌ది.

బీజేపీకి సర్ ముప్పు 

అయితే బీజేపీ గెలుపు, ఓట‌ముల‌ను ‘సర్‌’ (SIR) ప్ర‌భావితం చేయ‌నుంది. ప్ర‌స్తుతం పోలింగ్ జరుగుతున్న‌ దక్షిణ 24 పరగణాలు, నదియా జిల్లాల్లో భారీగా ఓట్లను తొలగించారు. దీంతో పోలింగ్‌పై ప్రభావం ప‌డ‌నుంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో 12.6 లక్షల ఓట్లు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 10.9 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఇక త‌న‌ కంచుకోట భవానీపూర్‌ నుంచి టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ పోటీపడుతున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ అగ్రనేత సువేంధు అధికారి నిలబడ్డారు.

Advertisement
Advertisement