త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parliament Session | సాయంత్రం 4 గంట‌ల‌కు మూడు బిల్లుల‌పై ఓటింగ్.. విప‌క్షాలు మ‌ద్ద‌తిచ్చేనా?

Parliament Session | చారిత్రాత్మ‌క మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు స‌హా మూడు కీల‌క బిల్లుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం లోక్‌స‌భ‌లో (Parliament Session) ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. గురువారం ఈ బిల్లుల‌పై వాడీవేడిగా చ‌ర్చ జ‌రిగింది.

G

National | Published On Apr 17, 2026, 8.51 am IST

Parliament Session | సాయంత్రం 4 గంట‌ల‌కు మూడు బిల్లుల‌పై ఓటింగ్.. విప‌క్షాలు మ‌ద్ద‌తిచ్చేనా?
Advertisement

Parliament Session | త్రినేత్ర‌.న్యూస్‌: చారిత్రాత్మ‌క మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు స‌హా మూడు కీల‌క బిల్లుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం లోక్‌స‌భ‌లో (Parliament Session) ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. గురువారం ఈ బిల్లుల‌పై వాడీవేడిగా చ‌ర్చ జ‌రిగింది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌ను (Women’s Reservation Bill) నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న బిల్లుతో (Delimitation Bill) ముడిపెట్ట‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించిన విప‌క్షాలు.. ఓటింగ్‌కు ప‌ట్టుబ‌ట్టాయి. దీంతో డివిజన్‌ (Voting)కు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతించారు. బిల్లుకు అనుకూలంగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 185 ఓట్లు వచ్చాయి. అనంతరం మూడు బిల్లులు రిజర్వేషన్ల చట్టం సత్వర అమలు, అందుకు వీలుగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్‌ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లు–2026ను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

వీటిపై గురువారం అర్ధరాత్రి వ‌ర‌కు సుదీర్ఘంగా సాగింది. బిల్లుకు అనుకూలంగా అధికార, వ్యతిరేకంగా విపక్ష సభ్యుల వాదనలతో సభ హోరెత్తిపోయింది. తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభ‌జ‌న‌తో క‌ర్ణాట‌క బీజేపీ ఎంపీ తేజ‌స్వీ సూర్య పోల్చ‌డంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం నెల‌కొంది. కాగా, ఈ బిల్లులపై శుక్రవారం ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌ళ్లీ చ‌ర్చ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంట‌ల‌కు మూడు బిల్లుల‌పై ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. వాటిలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. అయితే ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకు లోక్‌స‌భ‌లో అందుకు అవసరమైన సంఖ్యా బలం లేక‌పోవ‌డంతో ఓటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఓటింగ్‌కు అన్ని పార్టీలు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు కోరారు. డీలిమిటేష‌న్ వ‌ల్ల ఏ రాష్ట్రం న‌ష్ట‌పోద‌ని, అంద‌రికీ లాభ‌మేన‌ని ప్ర‌ధాని మోదీ ఇప్ప‌టికే చెప్పార‌న్నారు. ఇప్ప‌టికే తాము కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, ఎస్పీల మ‌ద్ద‌తు కోరామ‌ని చెప్పారు. కాగా, డీలిమిటేష‌న్ బిల్లు ఒక‌వేళ లోక్‌స‌భ‌లో ఆమోదం పొందిన‌ప్ప‌టికీ తాము కోర్టుకు వెళ్తామ‌ని త‌మిళ‌నాడులో అధికార‌పార్టీ డీఎంకే ప్ర‌క‌టించింది.

 

Advertisement
Advertisement