TVK Vijay | డీఎంకేది స్టాండ్ అప్ కామెడీ ప్రభుత్వం.. టీవీకే విజయ్ సెటైర్లు..!
TVK Vijay | అసెంబ్లీ ఎన్నిలకు ముందు తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నిలకు ముందు పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన టీవీకే పార్టీ అధినేత విజయ్ సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వెల్లూరులో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
TVK Vijay | అసెంబ్లీ ఎన్నిలకు ముందు తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నిలకు ముందు పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన టీవీకే పార్టీ అధినేత విజయ్ సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వెల్లూరులో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తన పార్టీ గుర్తు చిహ్నం విజిల్ అని.. దాన్ని ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు చారిత్రాత్మకమైనవని.. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని విజయ్ వ్యాఖ్యానించారు. అధికార డీఎంకే పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
డీఎంకే ఫేక్ మోడల్ ప్రభుత్వాన్ని నడుపోతందని, స్టాండ్ అప్ కామెడీ ప్రభుత్వం అంటూ సెటైర్లు వేశారు. ఈ పోరాటం తమిళనాడు వర్సెస్ ఢిల్లీ, ఎన్డీఏ కాదని.. ప్రజలకు, అవినీతికి మధ్య జరిగే ప్రత్యక్ష యుద్ధంగా విజయ్ అభివర్ణించారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు విజయ్ వర్సెస్ స్టాలిన్ మధ్య ప్రత్యక్ష పోటీ అవుతాయని తెలిపారు. ప్రజలతో సంబంధాలను నెరుపుతామని.. తన పార్టీ ఇచ్చిన హామీల నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గదని భరోసా ఇచ్చారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడితే తాను ప్రతి గ్రామం నుంచి జిల్లాను స్వయంగా సందర్శిస్తానని తెలిపారు.
సీఎం స్టాలిన్ తన వాగ్ధానాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తమకు నేరుగా ప్రజలతోనే మాట్లాడడమే లక్ష్యమని, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ హామీని నెరవేరుస్తామని విజయ్ పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ తమిళనాడు విజయం.. విజయ తమిళనాడు.. దీన్ని ప్రజల విశ్వాసానికి చిహ్నంగా అభివర్ణించారు. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు రెండు స్తంభాలుగా విడిపోయాయని, పోటీ నేరుగా టీవీకే, డీఎంకే మధ్య ఉందని స్పష్టం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును రిజర్వ్ చేసుకోవాలని, ఎలాంటి ఒత్తిడికి లొంగవద్దని విజ్ఞప్తి చేశాడు.
ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 234 అసెంబ్లీ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రధాన పోటీ డీఎంకే నేతృత్వంలోని కూటమి, ఏఐఏడీఎంకే-ఎన్డీఏ కూటమి మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఎన్డీఏలో బీజేపీ ప్రధాన పార్టీ, కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలు డీఎంకేతో పొత్తులో ఉన్నాయి. విజయ్ సైతం గతేడాది రాజకీయ పార్టీని స్థాపించారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దాంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత ముమ్మరంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






