త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Viral Video | రీల్స్ చేస్తూ హైస్పీడ్‌లో కారు నడిపి వ్యక్తి మృతికి కారణమైన మైనర్ వీడియో బయటికి

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కార్పియో నడిపిన 17 ఏళ్ల టీనేజర్‌ని అదుపులోకి తీసుకొని జువెనైల్ జస్టిస్ బోర్డ్ ముందు ప్రవేశపెట్టారు. అనంతరం అతడిని అబ్జర్వేషన్ హోమ్‌కి పంపించారు. ఫిబ్రవరి 10న అతడికి బోర్డు మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది.

J

National | Published On Feb 17, 2026, 3.29 pm IST

Viral Video | రీల్స్ చేస్తూ హైస్పీడ్‌లో కారు నడిపి వ్యక్తి మృతికి కారణమైన మైనర్ వీడియో బయటికి
Advertisement

Viral Video | అతడు మైనర్. కారు డ్రైవింగ్ చేసే వయసు కూడా కాదు. మరోవైపు ఆపోజిట్ డైరెక్షన్‌లో ఫుల్ స్పీడ్‌లో కారును నడుపుతూ రీల్స్ చేస్తున్నారు. డ్రైవర్ సీటు పక్కనే అతడి సోదరి ఉంది. అతడు ఎంత స్పీడ్‌లో కారు నడుపుతున్నాడో కారు డ్యాష్‌బోర్డు చూపిస్తోంది. అదే సమయంలో రోడ్డు మీద దారుణం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 3న ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటికి వచ్చింది. ఆరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ యువకుడి తల్లి ఇప్పుడు తనకు న్యాయం చేయాలని మీడియా ముందుకు వచ్చారు. సోషల్ మీడియాలో రిలీజయిన వీడియోను కూడా ట్రిమ్ చేశారని, కావాలని వీడియోను కట్ చేశారని, క్లారిటీ లేని వీడియోను బయటికి రిలీజ్ చేశారని ఆమె ఆరోపిస్తోంది.

న్యూఢిల్లీలోని ద్వారక సౌత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో లాల్ బహదూర్ శాస్త్రి కాలేజీ సమీపంలో ఫిబ్రవరి 3న జరిగిన ఈ ప్రమాదంలో సాహిల్ ధనేశ్రా అనే వ్యక్తి మృతి చెందాడు. హైస్పీడ్‌లో వెళ్తున్న స్కార్పియో ఎదురుగా వస్తున్న బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ మీద వస్తున్న సాహిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌తో పాటు స్విఫ్ట్ డిజైర్ కారు కూడా ప్రమాదానికి గురైంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కార్పియో నడిపిన 17 ఏళ్ల టీనేజర్‌ని అదుపులోకి తీసుకొని జువెనైల్ జస్టిస్ బోర్డ్ ముందు ప్రవేశపెట్టారు. అనంతరం అతడిని అబ్జర్వేషన్ హోమ్‌కి పంపించారు. ఫిబ్రవరి 10న అతడికి బోర్డు మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది. త్వరలో అతడికి క్లాస్ 10 బోర్డు పరీక్షలు ఉన్నాయని చెప్పి అతడికి తాత్కాలికంగా పరీక్షలు రాసే వరకు అనుమతి ఇచ్చింది.

https://x.com/htTweets/status/2023657825164272027

Advertisement
Advertisement