HK Dua | మాజీ జర్నలిస్ట్ హెచ్‌కే దువా కన్నుమూత.. సంతాపం ప్రకటించిన నేతలు..
HK Dua | ప్రముఖ పాత్రికేయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత హెచ్‌కే దువా కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
HK Dua | ప్రముఖ పాత్రికేయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత హెచ్‌కే దువా కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నేతలు, పాత్రికేయులు, పలురంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు లోధీ రోడ్ శ్మశానవాటికలో గురువారం నిర్వహించనున్నారు.
1937 జూలై 1న జన్మించిన హెచ్‌కే దువా, మాజీ ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్‌పేయి, హెచ్‌డీ దేవేగౌడలకు మీడియా సలహాదారుగా పనిచేశారు. రాజకీయాలపై ఆయనకు మంచి పట్టుంది. హిందుస్తాన్ టైమ్స్ పత్రిక సంపాదకుడిగా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎడిటర్ ఇన్ చీఫ్‌గా, ట్రిబ్యూన్ పత్రిక ఎడిటర్‌గా సేవలందించారు. అలాగే, టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఎడిటోరియల్ అడ్వైజర్‌గా వ్యవహరించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై పత్రికా కాలమ్స్ రాయడంతో పాటు చర్చల్లోనూ పాల్గొన్నారు. 2009-2015 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.
విదేశాంగ, జాతీయ భద్రత అంశాలపై చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా పనిచేశారు. విదేశాంగ స్థాయి సంఘం, గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన సలహా సంఘం సహా పలు కీలక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. పంజాబ్ యూనివర్సిటీ, కురుక్షేత్ర యూనివర్సిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి. పంజాబ్ యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కోర్ట్ సభ్యుడిగా సేవలందించారు. ఆయన మృతికి కాంగ్రెస్ నేతలు శశిథరూర్, మనిష్ తివారి తదితరులు సంతాపం ప్రకటించారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






