త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vandemataram | ‘జనగణమన’కు ఇచ్చిన గౌరవం వందేమాతరానికీ దక్కాలి: నడ్డా

నడ్డా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందించింది. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ ఈ చర్చ నెహ్రూ మీదనా? లేక వందేమాతరం మీదనా? అంటూ మండిపడ్డారు.

J

National | Published On Dec 11, 2025, 6.08 pm IST

Vandemataram | ‘జనగణమన’కు ఇచ్చిన గౌరవం వందేమాతరానికీ దక్కాలి: నడ్డా
Advertisement

Vandemataram | వందేమాతరం రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌లో ఇటీవల దీనిపై ప్రధాని మోదీ ప్రత్యేక చర్చ నిర్వహించారు. వందేమాతరం విశిష్టతను ఆయన లోక్ సభలో ప్రస్తావించారు. రాజ్యసభలోనూ వందేమాతరం గురించి చర్చ నిర్వహించారు. దీనిపై బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రాజ్యసభలో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జాతీయ సమైక్యతకు వందేమాతరం కృషి చేసిందని, భారత స్వాతంత్య్ర పోరాట సమయంలో దేశ ప్రజలను ఐక్యం చేసిన ఘనత వందేమాతరానికి దక్కుతుందన్నారు. అందుకే జాతీయ గీతం అయిన జనగనమణతో సమానంగా వందేమాతరానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వందేమాతరంలోని కొన్ని చరణాలను తొలగించి దేశ విభజనకు ఆజ్యం పోసిందని ఆరోపించారు.

దేశాన్ని ఏకం చేసిన మంత్రం

వందేమాతరం దేశాన్ని ఏకం చేసిన మంత్రం అని, అదే బ్రిటీష్ వాళ్లను భయబ్రాంతులకు గురి చేసిందన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన ప్రత్యేక చర్చను రాజ్యసభలో జేపీ నడ్డా ఈ వ్యాఖ్యలు చేసి ముగించారు.

మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను కించపరచడం కోసమో, అపకీర్తిపాలు చేయడం కోసమో ఈ చర్చ పెట్టలేదు. సందర్భం వచ్చింది కాబట్టి భారతదేశ చరిత్రను గుర్తుచేసుకోవడం కోసమే అని స్పష్టం చేశారు.

జనగణమన కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తా

జనగణమనకు నేను గౌరవం ఇస్తాను. దాని కోసం నా జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా నేను సిద్ధం. కానీ.. వందేమాతరం విషయంలో జరిగిన ఘటన అప్పుడు నాయకుడే బాధ్యత తీసుకోవాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నది ఎవరో కాదు.. జవహర్‌లాల్ నెహ్రూ.. అని గుర్తు చేశారు.

ఈ చర్చ నెహ్రూ మీదనా? లేక వందేమాతరం మీదనా?

నడ్డా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందించింది. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ ఈ చర్చ నెహ్రూ మీదనా? లేక వందేమాతరం మీదనా? అంటూ మండిపడ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement