MM Keeravani | కర్తవ్య పథ్‌లో కీరవాణి స్వరార్చన: 2,500 మంది కళాకారులతో భారీ ప్రదర్శన
రిపబ్లిక్ వేడుకలకు విదేశాల నుంచి పలువురు డెలిగేట్స్ రానున్నారు. యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటోనియో లుయిస్ శాంటోస్ ద కోస్టా, యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వొన్ డెర్ లెయెన్ వేడుకలకు హాజరుకానున్నారు.
Entertainment | Published On Jan 19, 2026, 7.33 pm IST
MM Keeravani | వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు అయిన సందర్భంగా ఇప్పటికే కేంద్రం 150 ఏళ్ల వందేమాతరం వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ వందేమాతరంపై ప్రత్యేక చర్చను నిర్వహించింది. వందేమాతరం గేయం విశిష్టత, స్వాతంత్య్రోద్యమంలో దాని పాత్రపై దేశానికి తెలిసేలా పార్లమెంట్‌లో ఎంపీలు చర్చించారు. కేంద్రం కూడా వందేమాతరం గేయానికి జనగణమనకు దక్కిన గౌరవమే ఇస్తామని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో త్వరలో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరం గేయాన్ని ప్రత్యేకంగా పలువురు కళాకారులతో సరికొత్త సంగీతాన్ని కంపోజ్ చేసి ప్రదర్శించనున్నారు.
జనవరి 26న న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరుగనున్న రిపబ్లిక్ డే వేడుకల కోసం ఆస్కార్ విజేత, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీత స్వరకల్పన చేయనున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2500 మంది కళాకారులతో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తాను పొందిన గొప్ప గౌరవం ఇది అంటూ కీరవాణి ట్వీట్ చేశారు. మనమంతా కలిసి జాతీయ భావాన్ని పెంపొందించేలా కలిసి వేడుక చేసుకోవాలి. వందేమాతరం అంటూ కీరవాణి ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.
జనవరి 26 వేడుకల కోసం రిహార్సల్స్
మరోవైపు ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో 77వ రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈసారి రిపబ్లిక్ వేడుకలకు విదేశాల నుంచి పలువురు డెలిగేట్స్ రానున్నారు. యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటోనియో లుయిస్ శాంటోస్ ద కోస్టా, యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వొన్ డెర్ లెయెన్ వేడుకలకు హాజరుకానున్నారు. అనంతరం జనవరి 27న జరగనున్న 126వ ఈయూ-భారత్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు.
https://x.com/mmkeeravaani/status/2013136144368845177
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Vande Mataram Trending | నెట్టింట వందే మాతరం ట్రెండింగ్.. విజయ్ ప్రమాణం స్వీకారోత్సవంలో ఇదే హైలెట్..!
మే 10, 2026

Kavya Kalyanram | త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ‘బలగం’ కావ్య..! వరుడు ఎవరో తెలుసా..?
మార్చి 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



