Vande Mataram Trending | నెట్టింట వందే మాతరం ట్రెండింగ్.. విజయ్ ప్రమాణం స్వీకారోత్సవంలో ఇదే హైలెట్..!
Vande Mataram Trending | తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగా వెట్రి కళగం (టీవీకే) వ్యవస్థాపకుడు, సినీ నటుడు సీ జోసఫ్ విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు.
Vande Mataram Trending | తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగా వెట్రి కళగం (టీవీకే) వ్యవస్థాపకుడు, సినీ నటుడు సీ జోసఫ్ విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు కూడా పదవీ ప్రమాణం చేశారు. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను ఆధిపత్యం చెలాయించిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలకు భిన్నంగా, ఈసారి నాన్ ద్రావిడ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు. అయితే, అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం ఈ నెల 13లోగా మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
నెట్టింట వైరల్..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కోసం కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతును విజయ్ సాధించారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రమాణ స్వీకారం కార్యక్రమం ప్రారంభం, ముగింపులోనూ పూర్తిస్థాయిలో వందేమాతరం ఆలపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా కార్యక్రమాల్లో వందేమాతరం రెండు చరణాలను ఆలపిస్తుంటారు. కానీ, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో
ముఖ్యంగా వందేమాతరంలోని పూర్తి ఆరు చరణాలను సింగర్స్ ఆలపించడం సభలోని అందరి దృష్టిని ఆకర్షించింది.
నెటిజన్ల ప్రశంసలు..
దాంతో విజయ్‌పై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “ప్రజల నాయకుడు విజయ్ తలపతి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు” ఓ యూజర్ వీడియోను షేర్ చేశారు. వందే మాతరం తమిళనాడు అంటూ మరొకరు స్పందించారు. “ప్రమాణ స్వీకారం ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తి వందే మాతరం వినిపించడం హృదయాన్ని హత్తుకుంది” అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికగా మహేశ్ అనే వినియోగదారు “వందే మాతరం పూర్తి వెర్షన్ వినడం ఎంతో ఆనందంగా అనిపించింది” అన్నారు. మరొకరు స్పందిస్తూ కార్యక్రమంలో మొదట వందే మాతరం, అనంతరం జనగణమన, తమిళ థాయ్ వాల్తు (రాష్ట్ర గీతం) ఆలపించడం తమిళనాడులో కొత్త పరిణామంగా అభివర్ణించారు. వందే మాతరం ఆలపించిన తీరు అద్భుతంగా ఉందని మరో నెటిజన్ ప్రశంసలు కురిపించారు. విజయ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తమిళ థాయ్ వాల్తు స్థానంలో వందే మాతరంతో ప్రారంభించడంతో రాష్ట్ర కార్యక్రమాల్లో రాష్ట్ర గీతానికి ప్రాధాన్యం కల్పించాలన్న దీర్ఘకాల రాజకీయ చర్చకు ముగింపు పలికిందా? అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి.
కేంద్రం ఆదేశాలతో..
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో వందేమాతరం ఆలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు వేదికపై మొదట వందేమాతరం గేయాన్ని ఆలపించగా, అనంతరం జనగణమనతో పాటు తమిళ్ థాయ్ వాల్తు ఆలపించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వందేమాతరం అన్ని ఆరు చరణాలనూ ప్రదర్శించాలనే సూచనలు ఇవ్వడంతో, తమిళనాడు కొత్త ప్రభుత్వం ఆ నిబంధనలను అమలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
150 ఏళ్ల వేడుకల సందర్భంగా..
వందేమాతరాన్ని ప్రముఖ రచయిత బంకించంద్ర ఛటర్జీ 1875లో రచించారు. అనంతరం తన ప్రసిద్ధ ‘ఆనంద్‌మఠ్’ నవలలో ఈ గేయాన్ని చేర్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వందేమాతరాన్ని జాతీయ గేయంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే, గేయంలోని కొన్ని భాగాల్లో మతపరమైన అంశాలు ఉన్నాయనే కారణంతో అధికారిక కార్యక్రమాల్లో తొలి రెండు చరణాలకే ప్రాధాన్యం ఇచ్చారు. తాజాగా వందేమాతరం 150 ఏళ్ల వేడుకలను నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం, పూర్తి గేయాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్రపతి హాజరయ్యే కార్యక్రమాలు, పౌర పురస్కారాల ప్రదానోత్సవాలు వంటి అధికారిక వేడుకల్లో వందేమాతరం ఆలపించాలని సూచిస్తూ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది.
💡The Swearing-in ceremony started with
1. Vande Mataram (original version)
2. National anthem
3. தமிழ் தாய் வாழ்த்துEnds with
1. Vande Mataram (original version)
2. National anthemTamil Nadu is now officially part of India after ages :P
...Start music D Stocks! https://t.co/KmsA2IAz1Y
— Saikiran Kannan | 赛基兰坎南 (@saikirankannan) May 10, 2026
With Vijay’s new government beginning its swearing-in ceremony with Vande Mataram instead of the Tamil Thai Vazhthu, questions are now being raised over whether the long political struggle in Tamil Nadu to give priority to the Tamil Thai Vazhthu at state events has come to an end… pic.twitter.com/AfAnQk31ne
— Subash (@Subash_tweetz) May 10, 2026
Joseph Vijay is the CM of Tamil Nadu!
Swearing in ceremony started and ended with full rendition of Vande Mataram! It was so nice to hear. pic.twitter.com/jjEggcu0ep
— Thiruvengadam A (@ThiruSpeaks_X) May 10, 2026
So nice to hear the full version of Vande Mataram 🙏
— Mahesh 🇮🇳 (@Mahesh10816) May 10, 2026
In the swearing-in ceremony, Vande Mataram was sung first, followed by Jana Gana Mana and Tamil Thai Vazhthu, which is new to Tamil Nadu.
— M Niyas Ahmed (@Journo_niyas) May 10, 2026
So nice to listen to Vande Mataram, that too twice on the same day.
— Narayanan Hariharan (@narayananh) May 10, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



