Donald Trump | 200% టారిఫ్ విధిస్తానని బెదిరించా.. 11 ఫైటర్ జెట్స్ కూలిపోయాయి.. ఇండియా-పాక్ యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్యలు
Donald Trump | భారత్-పాక్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాతపాటే ఎత్తుకున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం తానే ఆపానంటూ మరోసారి ప్రకటించుకున్నారు.
Donald Trump | భారత్-పాక్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాతపాటే ఎత్తుకున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం తానే ఆపానంటూ మరోసారి ప్రకటించుకున్నారు. ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోతే 200 శాతం టారిఫ్‌లు విధిస్తాని హెచ్చరించానని పేర్కొన్నారు. టారిఫ్ హెచ్చరికలతో యుద్ధం ముగించినట్లు వెల్లడించారు.
బోర్డ్ ఆఫ్ పీస్ ఈవెంట్‌లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా ట్రంప్ ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతలను ప్రస్తావించారు. "ఇండియా-పాక్ మధ్య భీకర యుద్ధం జరిగింది. దాన్ని నేనే ఆపాను. ఇరు దేశాలను టారిఫ్‌లతో బెదిరించాను. యుద్ధం ఆపకపోతే ఇరు దేశాలపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించా. పన్ను బెదిరింపులతో వెనకడుగు వేశాయి. ఆ యుద్ధ సమయంలో 11 ఫైటర్ జెట్స్ కూలిపోయాయి. అందులో చాలా ఖరీదైన జెట్స్ ఉన్నాయి" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, గతేడాది మే నుంచి ట్రంప్ 100 సార్లకుపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేసిఉంటారు. పాక్-భారత్ మధ్య యుద్ధం తానే ఆపానంటూ ప్రపంచ వేదికగా చెప్పుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో భారత్ మాత్రం మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. స్వయంగా ప్రధానే ఈ విషయాన్ని చెప్పినప్పటికీ.. ట్రంప్ ప్రకటనలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒకచోట భారత్-పాక్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రెండు దేశాల మధ్య యుద్ధం ఆపింది తానే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






