Yogi Adityanath | బాబ్రీ మసీద్ పునర్నిర్మాణ పనులను అడ్డుకుంటాం..! యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..!
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ బాబ్రీ మసీదు పునర్నిర్మాణం జరదని.. అందుకోసం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని ప్రకటించారు. మసీదు నిర్మించాలన్న వారి కలలు నెరవేరబోవని యోగి స్పష్టం చేశారు.
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ బాబ్రీ మసీదు పునర్నిర్మాణం జరదని.. అందుకోసం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని ప్రకటించారు. మసీదు నిర్మించాలన్న వారి కలలు నెరవేరబోవని యోగి స్పష్టం చేశారు. దరియాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన వారసత్వాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో అద్భుతమైన క్షణాలు వచ్చాయన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయాయని.. మరి అయోధ్యలో రామాలయం ఎందుకు నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు. రాముడు అందరికి చెందినవాడేనన్నాడు. తమ ప్రభుత్వం వాగ్ధానాలను నెరవేర్చడంలో నిబద్ధతతో ఉందన్నారు. అయోధ్య రామాలయం నిర్మాణంపై బీజేపీ అనుసరించిన వైఖరిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
రామ్ లల్లా కోసం వస్తామని.. అదే స్థలంలో ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పామని గుర్తు చేసిన ఆయన.. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. దేశ వారసత్వం, సంప్రదాయాలు, సనాతన ధర్మంపై గౌరవం ఉందని.. కాషాయ జెండా ఎప్పుడూ దేశ గౌరవాన్ని పెంచుతూనే ఉంటుందన్నారు. అయోధ్యలోని ఆలయంలో ప్రధాని మోదీ ఎగురవేసిన కాషాయ జెండాను సనాతన చిహ్నంగా యోగి అభివర్ణించారు. కొందరు అవకాశవాద వైఖరిని అవలంభిస్తారన్నారు. సంక్షోభ సమయంలోనే రాముడిని గుర్తుంచుకుంటారని.. లేకపోతే ఆయనను మరచిపోతారన్నారు. అలాంటి వారిని ఇప్పుడు రాముడు మరిచిపోయాడన్నారు. రామభక్తులపై కాల్పులు జరిపి.. రాముడి లక్ష్యాన్ని అడ్డుకునేవారికి చోటు లేదని స్పష్టం చేశారు. దేశ నియమ నిబంధనల మేరకు జీడించడం నేర్చుకోవాలని.. చట్టాన్ని పాటిస్తేను ప్రయోజనం ఉంటుందన్నారు. ఉల్లంఘించేవారు నకరానికి వెళ్తారన్నారు. ప్రతి భారతీయుడికి లక్ష్యం ఉందని.. దేశం గొప్పగా, సపన్నంగా, అభివృద్ధి చెందాలన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






