Vande Bharat Sleeper Trains | రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన కేంద్ర మంత్రి
Vande Bharat Sleeper Trains | వందేభారత్ స్లీపర్ రైళ్లపై (Vande Bharat Sleeper Trains) కేంద్రం కీలక ప్రకటన చేసింది. 260 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేసేందుకు యోచిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి (Union Railway Minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రకటించారు.
Vande Bharat Sleeper Trains | భారతీయ రైల్వే ఇటీవలే వందేభారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper Trains)ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దేశంలోనే తొలి స్లీపర్ వందే భారత్ రైలును జనవరి 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అసోంలోని కామాఖ్య, బెంగాల్ హౌరా మధ్య ఈరైలు ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఇక ఈ రైలుకు ప్రయాణికుల నుంచి వస్తున్న విశేషన స్పందనతో.. మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ప్రకటన చేసింది.
260 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేసేందుకు యోచిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి (Union Railway Minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రకటించారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. భారత రైల్వే ప్రొడక్షన్ యూనిట్లు వందే భారత్, నమో భారత్, రాపిడ్, రీజినల్ మెట్రో బోగీలు, కోల్‌కతా మెట్రో రైలు బోగీలు, అమృత్ భారత్, మెయిన్‌లైన్ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు వంటి ట్రైన్ సెట్‌లతో సహా విస్తృత శ్రేణి ప్యాసింజర్ రోలింగ్ స్టాక్‌ను తయారు చేస్తున్నట్లు చెప్పారు.
తొలి వందేభారత్ స్లీపర్..
దేశంలోనే తొలి స్లీపర్ వందే భారత్ రైలును జనవరి 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు కామాఖ్య, బెంగాల్ హౌరా మధ్య ప్రయాణికులకు అందుబాటులో ఉంది. అదే సమయంలో గౌహతి నుంచి హౌరా మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలును కూడా ఆయన వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.
అతివేగంగా.. అతిసౌఖ్యంగా..
వందేభారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ రైళ్లో ఒకేసారి 800 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. ఇందులో ప్రయాణిస్తే విమానంలో ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. కనీస చార్జి రూ.960తో టికెట్ ప్రారంభమవుతుంది. అత్యాధునిక సాంకేతికతతో ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. దానితో పాటు సీసీ కెమెరాలతో నిఘా, అత్యాధునిక అగ్నిప్రమాద నిరోధక వ్యవస్థలతో రైలును తీర్చిదిద్దారు. రైలుకు ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్, అధునాతన టాయిలెట్లు, రీడింగ్ లైట్స్, చార్జింగ్ పాయింట్లు అమర్చారు.
అన్నీ ఏసీ స్లీపర్ కోచ్‌లే..
ఈ స్లీపర్ వర్షెన్ రైళ్లలో మొత్తం 16 కోచ్‌లు ఉండగా, అందులో 11 థర్డ్ ఏసీ, 4 సెకెండ్ ఏసీ, 1 ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ప్రయాణీకులకు ప్రీమియం బెడ్‌రోల్స్, అధిక నాణ్యత దుప్పట్లు, ప్రయాణ సమయంలో క్యాటరింగ్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్ల కంటే ఛార్జీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్‌లు ఈ రైళ్లలో ఉండబోవు. ఈ రైలుకు 60 రోజుల ముందు నుంచే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అన్ని బెర్తులు అప్పటి నుంచే అందుబాటులో ఉంటాయి. అలాగే మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు వారి కోటా ప్రకారం టిక్కెట్ల బుకింగ్ ఉంటుంది. ఈ రైలులో ఇతర కోటాలకు అవకాశం లేదు.
సంబంధిత వార్తలు

India AI Impact Summit 2026 | ఇండియా ఏఐ సమ్మిట్ పొడిగింపు.. సందర్శకుల తాకిడితో కీలక నిర్ణయం.. తేదీలు ఇవే..!
ఫిబ్రవరి 18, 2026

Age Based Restrictions for Social Media | పిల్లలకు సోషల్ మీడియా బంద్? ఆస్ట్రేలియా తరహాలో భారత్ కీలక నిర్ణయం
ఫిబ్రవరి 17, 2026

PM Modi | భారత్‌లో అలాంటి రైళ్లు ఉంటే బాగుండేదని అనుకునేవాడిని.. ఇప్పుడు ఆ కల నెరవేరింది..!
జనవరి 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



