త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | భార‌త్‌లో అలాంటి రైళ్లు ఉంటే బాగుండేద‌ని అనుకునేవాడిని.. ఇప్పుడు ఆ క‌ల నెర‌వేరింది..!

PM Modi | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వం చేశారు. ఈ సంద‌ర్భంగా దేశంలోనే తొలి వందే భార‌త్ స్లీప‌ర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని రైలులో పిల్ల‌లు, లోకో పైల‌ట్ల‌తో మాట్లాడారు.

P

National | Published On Jan 17, 2026, 3.32 pm IST

PM Modi | భార‌త్‌లో అలాంటి రైళ్లు ఉంటే బాగుండేద‌ని అనుకునేవాడిని.. ఇప్పుడు ఆ క‌ల నెర‌వేరింది..!

సంక్షిప్త సారాంశం

PM Modi | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ‌నివారం బెంగాల్‌లో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న రూ.వేల‌కోట్ల విలువైన ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ఆయ‌న ప్రారంభోత్స‌వం చేశారు. దేశంలోనే తొలి వందే భార‌త్ స్లీప‌ర్ రైలుకు ప‌చ్చ‌జెండా ఊపి ప్రారంభించారు. రాజ‌కీయ ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మోదీ బెంగాల్ ప‌ర్య‌ట‌న చేప‌ట్ట‌డం విశేషం. సీబీఐ, ఈడీ దాడులు వివాదాస్ప‌దంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.

Advertisement
  • అమెరికా యూర‌ప్ కంటే ఎక్కువ లోకోమోటివ్‌లు త‌యారు చేస్తున్నాం
  • దేశ సాంకేతిక‌త‌కు చిహ్నంగా రైల్వేలు
  • ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ
  • బెంగాల్ వందే భార‌త్ స్లీప‌ర్, అమృత్ భార‌త్ రైళ్ల ప్రారంభోత్స‌వం

PM Modi | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వం చేశారు. ఈ సంద‌ర్భంగా దేశంలోనే తొలి వందే భార‌త్ స్లీప‌ర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని రైలులో పిల్ల‌లు, లోకో పైల‌ట్ల‌తో మాట్లాడారు. ఆ త‌ర్వాత ఆయ‌న మాల్దాలో నాలుగు అమృత్ భార‌త్ రైళ్ల‌ను సైతం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడారు. ఈ రోజు మాల్దా నుంచి బెంగాల్ అభివృద్ధిని వేగ‌వంతం చేసే తన ప్ర‌చారానికి మ‌రింత ఊపువ‌చ్చింద‌న్నారు. బెంగాల్‌లో కొత్త‌గా రైలు సేవ‌లు ప్రారంభించామ‌ని, ఆయా ప్రాజెక్టుల‌తో ప్ర‌జ‌ల‌కు ప్ర‌యాణం సుల‌భ‌త‌ర‌మ‌వుతుంద‌న్నారు.

ట్రాక్ నిర్వ‌హ‌ణతో ఇక్క‌డి యువ‌త‌కు కొత్త అవ‌కాశాలు వ‌స్తాయ‌న్నారు. ప‌విత్ర బెంగాల్ భూమి నుంచి భార‌తీయ రైల్వే ఆధునికీక‌ర‌ణ దిశ‌లో మ‌రో ముంద‌డుగు ప‌డింద‌న్నారు. వందే భార‌త్ స్లీప‌ర్ రైలును ప్రారంభించామ‌న్నారు. సుదూర ప్ర‌యాణాల‌ను మ‌రింత సౌక‌ర్య‌వంతంగా, విలాస‌వంతంగా, గుర్తుండిపోయేలా చేస్తాయ‌న్నారు. దేశంలోనే తొలి స్లీప‌ర్ రైలు కాళీమాత, కామాఖ్య దేవి కొలువైన భూభాగాల‌ను క‌లుపుతోంద‌న్నారు. రాబోయే కాలంలో అత్యాధునిక రైళ్ల‌ను విస్త‌రించ‌నునున్న‌ట్లు తెలిపారు. అత్యాధునిక రైళ్ల ఇంజిన్లు, కోచ్‌లు, మెట్రోకోచ్‌లు ఇవ‌న్నీ భార‌త‌దేశ సాంకేతిక‌త‌కు చిహ్నంగా నిలుస్తున్నాయ‌న్నారు.

ప్ర‌స్తుతం మ‌నం అమెరికా, యూర‌ప్ కంటే ఎక్కువ‌గా లోకోమోటివ్‌ల‌ను త‌యారు చేస్తున్నామ‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక దేశాల‌కు రైళ్లు, మెట్రో కోచ్‌లు ఎగుమ‌తి చేస్తున్నామ‌న్నారు. ఇవ‌న్నీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఎంత‌గానో ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయ‌ని, యువ‌త‌కు ఉపాధిని క‌ల్పిస్తాయ‌ని చెప్పుకొచ్చారు. తాను విదేశీ రైళ్ల ఫొటోలు చూసిన సంద‌ర్భంలో భార‌త్‌లో అలాంటి రైళ్లు ఉంటే బాగుండేది అనుకునేవాడిన‌ని.. నేడు ఆ క‌ల నెర‌వేరింద‌న్నారు. విదేశీయులు సైతం భార‌తీయ రైల్వేల గురించి ప్ర‌పంచానికి గొప్ప‌గా చెబుతున్నార‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో రూ.3250కోట్ల‌కుపైగా విలువైన ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement