US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లకు మహర్దశ..?
US Midterm Elections | అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముంది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలు, ఇరాన్‌తో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు దలాల్ స్ట్రీట్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఎంకే రీసెర్చ్ అంచనా ప్రకారం ఎన్నికల ఫలితాలకు సంబంధించి మూడు ప్రధాన పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు.
US Midterm Elections | అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముంది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలు, ఇరాన్‌తో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు దలాల్ స్ట్రీట్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఎంకే రీసెర్చ్ అంచనా ప్రకారం ఎన్నికల ఫలితాలకు సంబంధించి మూడు ప్రధాన పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు.
టారిఫ్‌లు వెంటనే తగ్గుతాయా..?
అమెరికా మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడిని మార్చకపోయినా, అక్కడి కాంగ్రెస్‌పై ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తుందనేది ప్రపంచ ఆర్థిక మార్కెట్లకు కీలకంగా మారనుంది. ముఖ్యంగా భారత స్టాక్ మార్కెట్లపై ఈ ఎన్నికల ప్రభావం ఉండే అవకాశముంది. 2026లో ఇప్పటివరకు సెన్సెక్స్, నిఫ్టీ గరిష్ఠంగా 12 శాతం వరకు పడిపోయాయి. ట్రంప్ టారిఫ్ విధానాల్లో మార్పులు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ ఈల్డ్స్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) అమ్మకాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో ఎంకే రీసెర్చ్ మూడు సాధ్యమైన ఎన్నికల ఫలితాలను అంచనా వేసింది. మొదటి పరిణామం ప్రకారం డెమొక్రాట్లు ప్రతినిధుల సభతోపాటు సెనేట్‌లోనూ విజయం సాధించే అవకాశం 60 శాతంగా ఉంది. ఈ పరిస్థితిలో ట్రంప్ టారిఫ్ నిర్ణయాలపై కాంగ్రెస్ పర్యవేక్షణ పెరుగుతుంది. అయితే వెంటనే టారిఫ్‌లు తగ్గుతాయని ఆశించలేమని, ప్రస్తుత విధానాలు చాలావరకు కొనసాగుతాయని పరిశోధనా సంస్థ అభిప్రాయపడింది. వలస విధానాలపై కూడా డెమొక్రాట్లు ప్రతిఘటన పెంచనుంది. అదే సమయంలో ఇరాన్‌తో అమెరికా ఉద్రిక్తతలు మళ్లీ పెరిగితే ముడి చమురు ధరలు ఎగబాకి భారత దిగుమతి బిల్లు, రూపాయి విలువ, స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ అవుతుందా..?
రెండో పరిణామం ప్రకారం డెమొక్రాట్లు ప్రతినిధుల సభను గెలుచుకుని, సెనేట్‌ను రిపబ్లికన్లు తమ ఆధీనంలో కొనసాగించుకునే అవకాశం 30 శాతంగా ఉంది. ఈ పరిస్థితిలో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై పర్యవేక్షణ, విచారణలు పెరిగినా, టారిఫ్ విధానాల్లో పెద్దగా మార్పులు ఉండవు. వలస విధానాలపై చర్చలు తీవ్రతరం కావడంతోపాటు ప్రభుత్వ ఖర్చులు, విధానపరమైన అంశాలపై ఇరు పార్టీల మధ్య విభేదాలు పెరిగి అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి (గవర్నమెంట్ షట్‌డౌన్) ఏర్పడే ప్రమాదం ఉందని ఐసీఐసీఐ గ్లోబల్ మార్కెట్స్ హెచ్చరించింది. మూడో పరిణామం ప్రకారం రిపబ్లికన్లు కాంగ్రెస్‌లోని రెండు సభలపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం 10 శాతంగా ఉంది. ఈ పరిస్థితిలో ట్రంప్ తన ప్రస్తుత విధానాలను మరింత స్వేచ్ఛగా అమలు చేయగలుగుతారు. అయితే ఇరాన్‌తో ఘర్షణలు మళ్లీ తీవ్రతరం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఎంకే రీసెర్చ్ అంచనా వేసింది. చమురు ధరలు భారీగా పెరిగితే భారత్ దిగుమతి వ్యయం పెరగడంతోపాటు రూపాయిపై ఒత్తిడి, ద్రవ్యోల్బణ సమస్యలు తలెత్తుతాయి. ఇంధనంపై ఆధారపడే కంపెనీల లాభాల మార్జిన్లు కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది.
భారత మార్కెట్లు పుంజుకుంటాయా..?
డెమొక్రాట్లు విజయం సాధిస్తే భారత స్టాక్ మార్కెట్లు తప్పనిసరిగా పుంజుకుంటాయని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల కంటే ముడి చమురు ధరలు, డాలర్ విలువ, అమెరికా బాండ్ ఈల్డ్స్, అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలోకి అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలే కీలకమవుతాయి. సీనియర్ ఎకనామిక్, ఏఐ నిపుణుడు సోహోమ్ బెనర్జీ అభిప్రాయం ప్రకారం.. అమెరికా మధ్యంతర ఎన్నికలు కంపెనీల ఆదాయ అంచనాలు, పెట్టుబడుల వ్యయంపై ప్రభావం చూపడం ద్వారా ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని చెప్పారు. వాణిజ్య విధానాల స్థిరత్వం, ప్రభుత్వ ఆర్థిక కేటాయింపులు, అంతర్జాతీయ పెట్టుబడుల కేటాయింపుల్లోనూ మార్పులు వస్తాయి. అమెరికా అధ్యక్షుడి నాలుగేళ్ల పదవీకాలంలో సగం పూర్తయిన తర్వాత జరిగే ఎన్నికలనే మధ్యంతర ఎన్నికలు అంటారు. ఈ ఎన్నికల్లో ప్రతినిధుల సభ, సెనేట్ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. కాంగ్రెస్‌కు చట్టాల ఆమోదం, ప్రభుత్వ వ్యయాలపై నిర్ణయాలు, అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలపై పర్యవేక్షణ వంటి బాధ్యతలు ఉంటాయి. అందువల్ల ఈ ఎన్నికలను అధ్యక్షుడి పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణగా కూడా పరిగణిస్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | వరుస లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. రెండు నెలల గరిష్టానికి సూచీలు..
నవంబర్ 4, 2026

Abdul El-Sayed | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో చరిత్ర.. సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తి
నవంబర్ 4, 2026

Donald Trump | నేను బ్యాలెట్లో లేను.. లేదంటే.. ఎన్నికల ఫలితాలపై ట్రంప్ ఆసక్తికర పోస్ట్
నవంబర్ 4, 2026
తాజావార్తలు
- ●TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలెర్ట్
- ●King 100 | కింగ్ 100లో టబు గ్లింప్స్
- ●IND Vs NZ ODI | కోహ్లీ విధ్వంసం.. కివీస్‌పై భారత్ ఘన విజయం
- ●Bandi Sanjay KTR Bouncer Row | ట్విట్టర్ టిల్లు మీది మేనేజ్మెంట్ కోటా.. మాది మెరిట్ కోటా..!
- ●CM Revanth Reddy | సదర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Stock Markets | వరుస లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. రెండు నెలల గరిష్టానికి సూచీలు..

TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలెర్ట్

King 100 | కింగ్ 100లో టబు గ్లింప్స్

IND Vs NZ ODI | కోహ్లీ విధ్వంసం.. కివీస్‌పై భారత్ ఘన విజయం

Bandi Sanjay KTR Bouncer Row | ట్విట్టర్ టిల్లు మీది మేనేజ్మెంట్ కోటా.. మాది మెరిట్ కోటా..!



