Petrol-Diesel Price | పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆలోచనే లేదు.. స్పష్టం చేసిన కేంద్రం..!
Petrol-Diesel Price | ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుబోతున్నాయంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ధరల పెంపుపై ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Petrol-Diesel Price | పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే యోచనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయన్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంగళవారం ఖండించింది. పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ఏప్రిల్ 29తో ముగియనున్న నేపథ్యంలో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌కావడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గత రెండు నెలల్లో క్రూడ్ ఆయిల్ ధరలు 50 శాతానికి పైగా పెరిగినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రతిపాదన లేదని తేల్చిచెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరుగుతాయన్న పుకార్లతో ప్రజలు భయంతో ఇంధనం కొనుగోలు చేయడంతో పలు చోట్ల పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరిగిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని నగరాల్లో 400పైగా బంకుల్లో ఇంధనం కొరత కనిపించిందని నివేదికలు పేర్కొన్నాయన్నారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రభుత్వం సూచించింది. అన్ని రిటైల్ అవుట్‌లెట్లపై పర్యవేక్షణ కొనసాగుతోందని, సరఫరా లోటు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 2022 ఏప్రిల్ నుంచి మార్పులు లేకుండా అధికారులు గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నప్పటికీ, వినియోగదారులపై భారం పడకుండా ధరలు స్థిరంగా ఉంచినట్లు చెప్పారు. అయితే, ప్రభుత్వ ఆయిల్ కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. లీటరుకు పెట్రోల్‌పై సుమారు రూ.20, డీజిల్‌పై రూ.100 వరకు నష్టం వస్తోందని అంచనా. రోజుకు సుమారు రూ.2,400 కోట్ల నష్టం జరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77, డీజిల్ రూ.87.67గా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఈ నెలలో సగటున 114 డాలర్లకుపైగా చేరాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
- ●OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు
- ●Janhvi Kapoor | సౌత్‌లో జాన్వీ స్పీడ్‌కు బ్రేక్.. ఇక పాత్రే ముఖ్యం!
- ●Vinayaka Chavithi | రెండు సౌండ్ బాక్సులకే అనుమతి.. పోలీసుల వార్నింగ్
- ●Heavy Rains | మండపాల్లో వినాయకులు జాగ్రత్త.. ఎందుకంటే..?
- ●Sreeleela | రాధలా ముస్తాబైన శ్రీలీల.. పింక్ లెహంగాలో అదుర్స్!

TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం

OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు

Janhvi Kapoor | సౌత్‌లో జాన్వీ స్పీడ్‌కు బ్రేక్.. ఇక పాత్రే ముఖ్యం!

Vinayaka Chavithi | రెండు సౌండ్ బాక్సులకే అనుమతి.. పోలీసుల వార్నింగ్





