త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET | నీట్‌పై ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌

P

National | Published On May 19, 2026, 8.30 pm IST

NEET | నీట్‌పై ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌
Advertisement

NEET | త్వ‌ర‌లోనే తిరిగి నీట్ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ ప్ర‌క‌టించారు. నీట్‌పై ఆయ‌న మంగ‌ళ‌వారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరీక్షను ఎలాంటి లోపాలు లేకుండా, పూర్తి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించాలని ఆయన అధికారులకు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలో సమగ్రత, పారదర్శకతకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకూడదని మంత్రి సూచించారు. గతంలో జరిగిన పరీక్షలో వెలుగుచూసిన సమస్యలను వెంటనే సరిచేయాలని కూడా ఆయన సూచించారు. మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన నేపథ్యంలో, దాన్ని జూన్ 21న మళ్లీ నిర్వహించనున్నట్లు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఈ నేపథ్యంలో, పరీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం పెంచాలని అధికారులకు మంత్రి సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా ఉండాలని, ఎలాంటి అలసత్వం కూడా సహించబోమని ఆయన హెచ్చరించారు. పేపర్ లీక్ కేసుపై ప్రస్తుతం సీబీఐ ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని మంత్రి వెల్ల‌డించారు. ఈ కేసులో సంబంధం ఉన్న పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు వివ‌రించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నామని, ఇది విద్యార్థుల ప్రయోజనానికే తీసుకున్న నిర్ణయమని మంత్రి స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన మరోసారి హెచ్చరించారు.

Advertisement
Advertisement