Census 2027 | జన గణనతో పాటే కుల గణన.. రూ.11,718 కోట్లు కేటాయింపు
2026 ఏప్రిల్, సెప్టెంబర్‌లో జరగబోయే తొలి ఫేజ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఇళ్లను లిస్ట్ చేసి లెక్కిస్తారు. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 30 రోజుల్లోనే అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఇళ్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఫేజ్ 2 లో జనాభా గణన ఉంటుంది.
Census 2027 | దేశ జనాభా లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే కేంద్రం సెన్సస్ 2027 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని కోసం రూ.13 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. 2011 లో జనాభా గణన తర్వాత మళ్లీ ఇప్పటి వరకు దేశ జనాభాను లెక్కించలేదు. మళ్లీ 16 ఏళ్ల తర్వాత భారత్‌లో జనాభా లెక్కింపు ప్రారంభం కానుంది. దాని కోసం రూ.11,718 కోట్ల బడ్జెట్‌ను కేంద్ర కేబినేట్ తాజాగా ఆమోదించింది.
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జన గణన కోసం రూ.11,718 కోట్లను కేంద్ర కేబినేట్ ఆమోదించిందని వెల్లడించారు. ఈ గణన పూర్తిగా డిజిటల్‌లో ఉంటుందని స్పష్టం చేశారు.
రెండు ఫేజ్‌లలో జన గణన ఉంటుంది. 2026 సంవత్సరం ఏప్రిల్, సెప్టెంబర్ లో తొలి ఫేజ్, ఫిబ్రవరి 2027 లో సెకండ్ ఫేజ్ జన గణన ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. జన గణనతో పాటే కుల గణన కూడా ఉంటుందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
ఫేజ్ 1 లోనే ఇళ్ల గణన
2026 ఏప్రిల్, సెప్టెంబర్‌లో జరగబోయే తొలి ఫేజ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఇళ్లను లిస్ట్ చేసి లెక్కిస్తారు. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 30 రోజుల్లోనే అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఇళ్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఫేజ్ 2 లో జనాభా గణన ఉంటుంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






