త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | తెలంగాణ‌ను విస్మ‌రించిన మోదీ స‌ర్కార్‌.. కేంద్ర‌ బ‌డ్జెట్‌లోని ముఖ్యాంశాలివే..

Union Budget 2026 | వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం 2026-27కి సంబంధించి పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ బ‌డ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ లోక్‌స‌భ ముందుకు తీసుకెళ్లారు.

D

National | Published On Feb 1, 2026, 1.30 pm IST

Union Budget 2026 | తెలంగాణ‌ను విస్మ‌రించిన మోదీ స‌ర్కార్‌.. కేంద్ర‌ బ‌డ్జెట్‌లోని ముఖ్యాంశాలివే..
Advertisement

Union Budget 2026 | వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం 2026-27కి సంబంధించి పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ బ‌డ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ లోక్‌స‌భ ముందుకు తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. భారతదేశ ఆర్థిక ప్రయాణం స్థిరమైన వృద్ధి (Stability Growth), మితమైన ద్రవ్యోల్బణంతో (Moderate Inflation) సాగుతోంద‌న్నారు. ప్రభుత్వం కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా, సంస్కరణలు, ఆచరణాత్మక నిర్ణయాల వైపు మొగ్గు చూపిన‌ట్లు చెప్పారు. అయితే, ఈ బ‌డ్జెట్‌లో తెలంగాణ‌ను మోదీ స‌ర్కార్ విస్మ‌రించింది. రాష్ట్రానికి ప్ర‌త్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయ‌లేదు. హైస్పీడ్ రైళ్లు త‌ప్ప ఎలాంటి ప్ర‌త్యేక ప‌థ‌కాల‌నూ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

నిర్మ‌ల‌మ్మ‌ బ‌డ్జెట్ ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలివే..

  • FY27 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాన్ని రూ. 12.2 లక్షల కోట్లుగా నిర్ణయించారు. ఇది దేశ చరిత్రలోనే అత్యధికం.
  • 2026-27 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును GDPలో 4.3 శాతం వద్ద అంచనా వేశారు.
  • GDP నిష్పత్తిలో అప్పులు 56.1 శాతం నుంచి 55.6 శాతంకి తగ్గుతాయని అంచనా వేశారు.
  • మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.53.5 లక్షల కోట్లు కాగా, నికర పన్ను రాబడి రూ.28.7 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
  • రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు.
  • నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధికి ఐదేళ్లలో రూ.5,000 కోట్లు కేటాయించారు.
  • ఏడు హై స్పీడ్ కారిడార్లు.. (ముంబై - పుణె, పుణె - హైద‌రాబాద్, హైద‌రాబాద్ - బెంగ‌ళూరు, హైద‌రాబాద్ - చెన్నై, చెన్నై - బెంగ‌ళూరు, ఢిల్లీ - వార‌ణాసి, వార‌ణాసి - సిలిగురి)
  • పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేందుకు, వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 20 కొత్త జలమార్గాలను (Waterways) అందుబాటులోకి తేనున్నారు.
  • పారిశ్రామిక రంగానికి, ముఖ్యంగా ఫార్మా, చిన్న పరిశ్రమలకు (MSME) పెద్దపీట
  • బలమైన దేశీయ తయారీ రంగాన్ని నిర్మించడం, ఇంధన భద్రతను మెరుగుపరచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి.
  • భారతదేశాన్ని ప్రపంచ బయోఫార్మా తయారీ హబ్‌గా (Global Biopharma Hub) తీర్చిదిద్దేందుకు 'బయోఫార్మా శక్తి' (Biopharma Shakti) ప‌థ‌కం.. దీని కోసం రాబోయే ఐదేళ్లలో రూ10,000 కోట్ల కేటాయింపులు.
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా రూ.10,000 కోట్ల నిధి
  • మైక్రో ఎంటర్‌ప్రైజెస్ (Micro Enterprises) కోసం రూ.2,000 కోట్ల నిధి
  • జౌళి రంగాన్ని ప్రోత్సహించేందుకు 'నేషనల్ ఫైబర్ స్కీమ్'
  • టెక్స్టైల్ రంగంలో నైపుణ్యాభివృద్ధి (Skilling system) కోసం కొత్త ప్రణాళిక
  • రేర్ ఎర్త్ కారిడార్లు: దేశంలో 3 'రేర్ ఎర్త్ కారిడార్ల' (Rare Earth Corridors) ఏర్పాటు
  • దేశ సెమీకండ‌క్ట‌ర్ వృద్ధి కోసం సెమీ కండ‌క్ట‌ర్ ఇండియా మిష‌న్ 2.0ని (Semiconductor mission 2.0). ఇందుకోసం రూ.40,000 కోట్లు కేటాయింపు.
  • నేష‌న‌ల్ ఫైబ‌ర్ ప్ర‌ణాళిక కింద ప‌ట్టు, జ‌న‌ప‌నార‌కు ప్రాధాన్యం.
  • క్రీడా వస్తువుల తయారీ, ఆవిష్కరణ, పరిశోధనలపై ప్రాధాన్యత.
  • 20 ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో 10వేల మంది గైడ్‌ల నైపుణ్యాలను పెంపొందించడానికి ప్ర‌ణాళిక.
  • నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ ఏర్పాటు.
  • హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ క‌శ్మీర్, అరకు లోయలో రోడ్ల‌ అభివృద్ధి.
  • 2026-27లో మూలధన వ్యయాన్ని రూ.12.2 లక్షల కోట్లకు పెంచే ప్రతిపాదన.
  • చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు.
  • 500 రిజర్వాయర్లలో చేపల పెంపకం, అభివృద్ధికి చర్యలు.
  • పశు సంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సాహకాలు.
  • వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల నాటకానికి ప్రోత్సాహం.
  • గ్రామీణ చేతివృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 'మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్' పథకాన్ని ప్రకటించింది. ఖాదీ, చేనేత, హస్తకళల (Handicrafts) రంగాలను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యంగా నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
  • ఒడిశాలోని ఖనిజ సంపద ఉన్న ప్రాంతాలను జలమార్గాల ద్వారా అనుసంధానించనున్నారు.
  • దేశంలో మూడు ఆయుర్వేద ఆసుప‌త్రుల ఏర్పాటు.
  • భారతదేశాన్ని 'గ్లోబల్ బయోఫార్మాస్యూటికల్ హబ్'గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా నిర్మ‌ల‌మ్మ తెలిపారు.
  • క్యాన్సర్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులకు మందులను సరసమైన ధరలకు అందుబాటులోనే ఉంచ‌నున్న‌ట్లు కేంద్ర‌మంత్రి వెల్ల‌డించారు.
  • 17 రకాల క్యాన్సర్ మందులకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఇచ్చారు.
  • ఏప్రిల్ నుంచి అమ‌ల్లోకి కొత్త ఇన్‌క‌మ్ ట్యాక్స్ చ‌ట్టం
  • విదేశాలకు వెళ్లే భారతీయులకు బడ్జెట్‌లో భారీ ఊరట లభించింది.
  • వ్యక్తిగత వినియోగం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని (Tariff) 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు.
  • రూ.20 లక్షల కంటే తక్కువ విలువైన విదేశీ ఆస్తులను (స్థిరాస్తి కాకుండా) వెల్లడించని వారికి ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
  • ఫ్యూచర్స్ మార్కెట్లో STTని 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచారు.
  • ప్రవాస భారతీయులు (Non-residents) ఆస్తి అమ్మినప్పుడు, కొనుగోలుదారులు తమ పాన్ (PAN) కార్డు ద్వారానే TDS చెల్లించవచ్చు. ప్రత్యేకంగా TAN నంబర్ అవసరం లేదు.
Advertisement
Advertisement