త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | బెంగాల్‌కు ఒక్క పైసా ఇవ్వ‌లేదు.. కేంద్రంపై సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఫైర్‌..

Union Budget 2026 | కేంద్ర‌ బడ్జెట్ 2026-27ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌కు రావాల్సిన నిధులను విడుదల చేయడంలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు.

S

National | Published On Feb 1, 2026, 3.35 pm IST

Union Budget 2026 | బెంగాల్‌కు ఒక్క పైసా ఇవ్వ‌లేదు.. కేంద్రంపై సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఫైర్‌..
Advertisement

Union Budget 2026 | కేంద్ర‌ బడ్జెట్ 2026-27ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌కు రావాల్సిన నిధులను విడుదల చేయడంలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్‌లను ప్రతిపాదించిన కేంద్రం, అందులో వారణాసి-సిలిగురి మార్గాన్ని కూడా చేర్చింది. అలాగే తూర్పు పశ్చిమ బెంగాల్‌లోని డాంకుని నుంచి పడమర గుజరాత్‌లోని సూరత్ వరకు కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనలపై స్పందించిన మమతా బెనర్జీ, కేంద్రం బహిరంగ అబద్ధాల‌ను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. జీఎస్టీ అంశంలోనూ కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు.

బెంగాల్‌కు పైసా ఇవ్వ‌లేదు, ప‌న్ను మాత్ర‌మే ఉంది: సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

వాళ్లు మూడు కారిడార్‌లు ప్రకటించామని చెబుతున్నారు. మేము ఇప్పటికే ఆరు ప్రకటించాం. వారు చెప్పిన మూడు కారిడార్‌ల మాటలు పూర్తిగా అబద్ధాలే. అవన్నీ ఇప్పటికే ప్రక్రియలో ఉన్నాయి, పనులు కూడా మొదలయ్యాయి. పూరూలియాలోని జంగల్‌మహల్-జంగల్ సుందరి ప్రాజెక్టులో ఈ ఆర్థిక కారిడార్ కోసం రూ.72వేల‌ కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. కానీ బెంగాల్‌కు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఒక్క పన్ను మాత్రమే ఉంది, అది జీఎస్‌టీ, అని ఆమె అన్నారు. మా డబ్బునే తీసుకెళ్లి, మాకు ఇస్తున్నట్టు గొప్పలు చెబుతున్నారు. అది మా సొంత డబ్బే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడిపించే నైతిక హక్కు వారికి లేదు. దేశ ఆర్థిక నిర్మాణాన్ని, రాజ్యాంగ వ్యవస్థను, స్వతంత్ర సంస్థలను ధ్వంసం చేయాలనుకుంటున్నారు. ఎక్కువ మాటలు, తక్కువ పని, అని మమతా బెనర్జీ ధ్వ‌జ‌మెత్తారు.

పీఆర్ విభాగం రిపోర్ట్‌లా ఉంది: ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ..

కాగా పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలో పశ్చిమ బెంగాల్ పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని ఆయన ఆరోపించారు. 5001 సెకన్ల ప్రసంగంలో బెంగాల్ పేరు ఒక్కసారైనా లేదు. రైతులు, యువత గురించి మాట్లాడలేదు. ఏఐ, టెక్నాలజీ అంటారు కానీ ఉపాధి గురించి చర్చ లేదు. ఆదాయ స్థిరత్వం, ఆర్థిక భద్రతపై ఎలాంటి స్పష్టత లేదు. ఇది ముఖంలేని, ఆధారంలేని, దృష్టిలేని బడ్జెట్. పీఆర్ విభాగం రాసుకున్న స్వీయ అంచనా నివేదికలా ఉంది. ఏ వర్గానికీ స్పష్టమైన పరిష్కారాలు లేవు. కేంద్రం బెంగాల్‌ను బంగ్లాదేశ్‌లా చూస్తోంది, అని ఆయన ఆరోపించారు.

ఈ ఏడాది చివర్లో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పర్యావరణ అనుకూల సరుకు రవాణాను ప్రోత్సహించేందుకు డాంకుని నుంచి సూరత్ వరకు కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి మరోసారి స్పష్టం చేశారు. అలాగే ముంబయి-పూణె, పూణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి మధ్య 7 హైస్పీడ్ రైలు కారిడార్‌ల అభివృద్ధి ప్రతిపాదనను ప్రకటించారు. అయితే ఆర్థిక మంత్రి ప్ర‌సంగంలో బెంగాల్‌ను అస‌లు ప్ర‌స్తావించ‌లేద‌ని, బెంగాల్‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టి నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని సీఎం మ‌మ‌త ఫైర‌య్యారు.

Advertisement
Advertisement