Red Fort Blast | ఢిల్లీ బ్లాస్ట్ వెనుక జైషే హస్తం.. ఐరాస సంచలన నివేదిక
Red Fort Blast | గతేడాది ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి (Red Fort Blast)పై ఐక్యరాజ్య సమితి సంచలన నివేదిక (UN Report) విడుదల చేసింది.
Red Fort Blast | గతేడాది ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి (Red Fort Blast)పై ఐక్యరాజ్య సమితి సంచలన నివేదిక (UN Report) విడుదల చేసింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని వెల్లడించింది. అంతేకాదు, జైషే సంస్థ తన ఉగ్రవాద కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రత్యేకంగా మహిళా విభాగాన్ని (Jaishe Women Wing) ఏర్పాటు చేయడంపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఐరాస భద్రతా మండలికి సమర్పించిన తాజా నివేదికలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది నవంబర్ 9న ఎర్రకోట వద్ద ఉగ్రదాడికి జైషే సంస్థకు సంబంధం ఉందని ఓ సభ్య దేశం నివేదించినట్లు తెలిపింది. ఈ దాడిలో 15 మంది మరణించినట్లు అందులో ప్రస్తావించింది. ఈ దాడితో పాటు మరికొన్ని దాడులకు జైషే బాధ్యత వహించినట్లు ఒక సభ్య దేశం తెలిపినట్లు నివేదికలో పొందుపరిచారు.
అంతేకాకుండా అంతర్జాతీయ నిఘా నుంచి తప్పించుకునేందుకు జైషే సంస్థ కొత్త ఎత్తుగడలకు పూనుకున్నట్లు సదరు నివేదిక తెలిపింది. ఇందులో భాగంగానే జైషే చీఫ్ మసూద్ అజార్ 2025 అక్టోబర్ 8న 'జమాత్ ఉల్-ముమినత్' పేరుతో మహిళా విభాగాన్ని అధికారికంగా ప్రకటించినట్లు వెల్లడించింది. ఉగ్రవాద దాడులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. దీంతో తమ మద్దతుదారుల సంఖ్యను పెంచుకునేందుకు, రవాణా నెట్‌వర్క్‌లను విస్తరించి, భద్రతా దళాల నిఘా నుంచి తప్పించుకునేందుకు జైషే మహిళలను తన ఉగ్ర కార్యకలాపాల్లోకి దించుతోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
జైషేలో మహిళా ఉగ్రవాద దళం
జైషే సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మరో కొత్త కుట్రకు తెరలేపింది. కేవలం మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్‌ను తయారుచేస్తోంది. మసూద్ అజార్ (Masood Azhar) సోదరి సాదియా అజార్ (Sadiya Azhar) నేతృత్వంలో ‘జమాతుల్-ముమినాత్’ (Jamaat ul-Muminat) పేరుతో ఓ ప్రత్యేక యూనిట్‌ను తయారుచేస్తున్నది. ఇందు కోసం నియామక డ్రైవ్ గతేడాది అక్టోబర్ 8న జైషే ప్రధాన కార్యాలయం మర్కజ్ ఉస్మాన్-ఓ-అలీలో ప్రారంభమైంది. ఈ డ్రైవ్‌లో భాగంగా పాక్‌లోని బహవల్‌పూర్, ముల్తాన్, సియాల్‌కోట్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లి నుంచి మహిళలను ఉగ్రవాద సంస్థలోకి చేర్చుకున్నారు.
ఈ సంస్థ రూ.500 ఫీజుతో 40 నిమిషాలు ఆన్‌లైన్ శిక్షణ ఇస్తూ.. మహిళల్ని ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఐఎస్‌ఐఎస్, హమాస్, ఎల్‌టీటీఈ తరహాలో ఫిదాయిన్ (ఆత్మాహుతి) దాడులు నిర్వహించడానికి ఈ మహిళలతో ఉగ్రవాద బ్రిగేడ్‌లను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఇక ఈ వింగ్‌లో ఇప్పటికే 5,000 మందికిపైగా మహిళలు చేరినట్లు మసూద్ అజారే స్వయంగా ప్రకటించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026

Rajdhani Express | షార్ట్ సర్క్యూట్‌తో.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం
మే 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



