త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Udhayanidhi Stalin | చాలా మంది మా నాన్న‌కే జై కొడుతున్నారు.. కూట‌మి నాయ‌క‌త్వంపై ఉద‌య‌నిధి కీల‌క వ్యాఖ్య‌లు

Udhayanidhi Stalin | విపక్ష‌ 'ఇండియా' (INDIA) కూటమిలో నాయకత్వ పోరు మ‌ళ్లీ మొద‌లైంది. రాహుల్ నాయ‌క‌త్వంపై కూట‌మి పార్టీల నేత‌లు గ‌త కొంత‌కాలంగా వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే.

D

National | Published On Feb 23, 2026, 1.58 pm IST

Udhayanidhi Stalin | చాలా మంది మా నాన్న‌కే జై కొడుతున్నారు.. కూట‌మి నాయ‌క‌త్వంపై ఉద‌య‌నిధి కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

Udhayanidhi Stalin | విపక్ష‌ 'ఇండియా' (INDIA) కూటమిలో నాయకత్వ పోరు మ‌ళ్లీ మొద‌లైంది. రాహుల్ నాయ‌క‌త్వంపై కూట‌మి పార్టీల నేత‌లు గ‌త కొంత‌కాలంగా వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. కూట‌మి ప‌గ్గాలను వేరే నేత‌కు అప్ప‌గించాల‌ని చూస్తున్నారు. ఈ అంశంపై (Opposition Leadership Row) కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నాయ‌క‌త్వ పోరుపై త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ ( Udhayanidhi Stalin) తాజాగా త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

తమిళనాడులో జరిగిన ఒక సమావేశంలో ఉద‌య‌నిధి మాట్లాడుతూ.. "రాజ‌కీయాల్లోనూ, పాల‌న‌లోనూ నా తండ్రి ఎంకే స్టాలిన్‌ని పలువురు నేతలు ఆదర్శంగా భావిస్తున్నారు. బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌జాస్వామ్య పోరాటానికి నాయ‌క‌త్వం వ‌హించాల‌ని వివిధ రాష్ట్రాల నాయకులు కోరుతున్నారు. మా ఆకాంక్ష కూడా అదే" అని ఈ సంద‌ర్భంగా ఉద‌య‌నిధి స్ప‌ష్టం చేశారు.

కాగా, ఇటీవ‌లే ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మితో కాంగ్రెస్‌, రాహుల్ నాయ‌క‌త్వ ప‌టిమ‌పై కూట‌మి భాగ‌స్వామ్య పార్టీల్లో న‌మ్మ‌కం స‌న్న‌గిల్లింది. రాహుల్‌ నాయకత్వంలో బీజేపీని ఎదుర్కోవడం కష్టమేనని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే తామూ మునగడం ఖాయమని ఆయా పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే రాహుల్‌కు ప్ర‌త్యామ్నాయంగా ప‌లువురు నేత‌ల‌కు జై కొడుతున్నారు. ముఖ్యంగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి ప‌లువురు జైకొడుతున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి డీఎంకే కూడా వ‌చ్చి చేరింది.

కూట‌మి ప‌గ్గాలు మ‌మ‌తా బెన‌ర్జీకి అప్ప‌గించాలి..

విపక్ష 'ఇండియా' కూటమి (INDIA Bloc) డ్రైవింగ్ సీటు నుంచి త‌ప్పుకోవాల‌ని పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత (Congress leader) మణిశంకర్‌ అయ్యర్‌ (Mani Shankar Aiyar) సూచించారు. ఇండియా ప‌గ్గాల‌ను ప్రాంతీయ పార్టీల నేత‌ల‌కు వ‌దిలేయాల‌న్నారు. అందుకు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) అర్హురాల‌ని పేర్కొన్నారు. "ఇండియా కూట‌మి బాధ్య‌త‌ల నుంచి రాహుల్ త‌ప్పుకోవాలి. కూటమి డ్రైవింగ్ సీటును ప్రాంతీయ పార్టీల నేత‌ల‌కు అప్ప‌గించాలి. అందుకు మ‌మ‌తా బెన‌ర్జీ అర్హురాలు. ఆమెతోపాటూ మ‌రో న‌లుగురు కూడా ఈ స్థానానికి అర్హులే. స్టాలిన్‌, అఖిలేష్ యాద‌వ్‌, తేజ‌స్వీ యాద‌వ్ లేదా మ‌రెవరికైనా ఇండియా ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని నేను ఆశిస్తున్నాను" అని మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement