Twisha Sharma Case | సుప్రీంకోర్టుకు చేరిన ట్విషా శర్మ కేసు.. రేపు విచారించే ఛాన్స్..!
Twisha Sharma Case | భోపాల్‌కు చెందిన నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు మృతి కేసులో స్వయంగా (Suo Motu) జోక్యం చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారించనుంది.
Twisha Sharma Case | భోపాల్‌కు చెందిన నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు మృతి కేసులో స్వయంగా (Suo Motu) జోక్యం చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారించనుంది. ట్విషా శర్మ ఈ నెల 12న తన అత్తవారింట్లో శవమై కనిపించింది. యూపీలోని నోయిడాకు చెందిన ట్విషాను కొద్దినెలల కిందటనే అడ్వకేట్ సమర్థ్ సింగ్ వివాహం చేసుకున్నారు. ట్విషా మృతి తర్వాత భర్త పరారీలో ఉండగా.. సమర్థ్ సింగ్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరుచగా ఏడురోజుల కస్టడీకి అనుమతించింది.
ఈ కేసులో సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని, ఆధారాల సేకరణ, సాక్షాలను సేకరించేందుకు కస్టడీ అవసరమని పోలీసులు తెలిపారు. ట్విషా మృతి కేసుల్లో అత్తింటి వారిపై బాధిత కుటుంబం ఆరోపణలు చేసింది. మృతి అత్తింటి వారే కారణమని వాదిస్తున్నారు. మరో వైపు అత్తింటి వారి తరఫు న్యాయవాది ఎనోష్ జార్జ్ కేసు నుంచి తప్పుకున్నారు. మీడియాతో వివాదాల నేపథ్యంలో ఆయన కేసు నుంచి వెనక్కి తగ్గారు. దాంతో ట్విషా అత్త, మాజీ జిల్లా సెషన్స్ జడ్జి గిరిబాలా సింగ్ స్వయంగా తమ కుటుంబం తరఫున వాదనలు వినిపించనున్నారు.
ఇదిలా ఉండగా.. ట్విషా మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించేందుకు మధ్య ప్రదేశ్ హైకోర్టు అనుమతిచ్చింది. దాంతో ఢిల్లీ ఎయిమ్స్ నుంచి నలుగురు ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని భోపాల్‌కు పంపనున్నారు. ఈ బృందం ఇచ్చే నివేదికను ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా పరిశీలించి, తుది నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ పంపింది. ఇదిలా ఉండగా, ట్విషా తండ్రి నవనిధి శర్మ ఇటీవల ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌ను కలిసి సీబీఐ విచారణ చేయించాలని కోరగా, సానుకూలంగా స్పందించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Special Trains | పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు.. మూడు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..
అక్టోబర్ 16, 2026

Ind Vs WI | ఐదో టీ20లోకి భువనేశ్వర్ కుమార్.. అర్ష్‌దీప్‌కు గాయం!
అక్టోబర్ 16, 2026

Navaratri Brahmotsavam | భక్తులను కటాక్షించిన శ్రీకృష్ణుడు.. మోహినీ అవతారంలో మలయప్పస్వామి..
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●OTT Releases | శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ - ఒక్కోటి ఒక్కో జానర్
- ●Tummala Nageshwar Rao | వైటీపీఎస్‌కు మహానది బొగ్గును కేటాయించండి..
- ●Amazon Business | అమెజాన్ బంపర్ ఆఫర్.. కార్పొరేట్ గిఫ్ట్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు..
- ●Special Trains | పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు.. మూడు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Vodafone Idea | వొడాఫోన్ ఐడియా (వీఐ) సరికొత్త ప్రయోగం.. ప్రీపెయిడ్ ప్లాన్లలోనూ ఫ్యామిలీ షేరింగ్..
- ●Ramachander Rao | దేశంలో అధికార మార్పిడికి కుట్ర : రామచందర్ రావు

OTT Releases | శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ - ఒక్కోటి ఒక్కో జానర్

Tummala Nageshwar Rao | వైటీపీఎస్‌కు మహానది బొగ్గును కేటాయించండి..

Amazon Business | అమెజాన్ బంపర్ ఆఫర్.. కార్పొరేట్ గిఫ్ట్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు..

Special Trains | పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు.. మూడు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..



