త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK Chief Vijay | నార్త్ చెన్నై నుంచి ఎమ్మెల్యేగా విజయ్ పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 10 మే 2026 లోపు నిర్వహించాల్సి ఉంటుంది. 234 అసెంబ్లీ స్థానాల్లో 2021 ఎన్నికల్లో డీఎంకే - కాంగ్రెస్ కూటమి 151 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

J

National | Published On Feb 22, 2026, 5.47 pm IST

TVK Chief Vijay | నార్త్ చెన్నై నుంచి ఎమ్మెల్యేగా విజయ్ పోటీ
Advertisement

TVK Chief Vijay | తమిళనాడులో ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇటీవలే పార్టీ పెట్టిన కోలీవుడ్ స్టార్ విజయ్ కూడా తన పార్టీని సమాయత్తం చేస్తున్నాడు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని గెలిపించాలని ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి విజయ్ ప్రచారం నిర్వహిస్తున్నాడు. అయితే.. విజయ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు అనే ఆసక్తి తమిళనాడు ప్రజల్లో నెలకొన్నది. ఈనేపథ్యంలో విజయ్ ఎన్నికల పోటీపై ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున క్లారిటీ ఇచ్చారు.

234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ నార్త్ చెన్నైలో ఉన్న నియోజకవర్గాల్లో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. మన నేత విజయ్ ఇక పరిగెత్తడానికి రెడీ అయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు అని అర్జున మీడియాకు తెలిపారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 10 మే 2026 లోపు నిర్వహించాల్సి ఉంటుంది. 234 అసెంబ్లీ స్థానాల్లో 2021 ఎన్నికల్లో డీఎంకే - కాంగ్రెస్ కూటమి 151 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఎన్డీఏ కూటమిలో ఉన్న ఏఐఏడీఎంకే, బీజేపీ పార్టీలు తమిళనాడులో పాగా వేసేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. మరోవైపు టీవీకే కూడా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ తమిళనాడు మొత్తం విజిల్ వినిపించేలా చేయాలని కసరత్తు చేస్తోంది.

Advertisement
Advertisement