త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mukul Roy | తృణ‌మూల్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ ముకుల్ రాయ్ క‌న్నుమూత‌..

Mukul Roy | బెంగాల్ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) క‌న్నుమూశారు. గ‌త‌కొంత‌కాలంగా అనారోగ్యంతో బాద‌ప‌డుతున్న ఆయ‌న తెల్ల‌వారుజామున 1.30 గంట‌ల‌కు కార్డియాక్ అరెస్టుతో (Cardiac Arrest) కోల్‌క‌తాలోని ఓ ద‌వాఖాన‌లో తుదిశ్వాస విడిచారు.

G

National | Published On Feb 23, 2026, 7.54 am IST

Mukul Roy | తృణ‌మూల్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ ముకుల్ రాయ్ క‌న్నుమూత‌..
Advertisement

Mukul Roy | త్రినేత్ర‌.న్యూస్‌: బెంగాల్ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) క‌న్నుమూశారు. గ‌త‌కొంత‌కాలంగా అనారోగ్యంతో బాద‌ప‌డుతున్న ఆయ‌న తెల్ల‌వారుజామున 1.30 గంట‌ల‌కు కార్డియాక్ అరెస్టుతో (Cardiac Arrest) కోల్‌క‌తాలోని ఓ ద‌వాఖాన‌లో తుదిశ్వాస విడిచారు. ఈ మేర‌కు ఆయ‌న కుమారుడు సుభ్రాంషు రాయ్ వెల్ల‌డించారు.

ముకుల్ రాయ్ అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్‌లో పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) త‌ర్వాతి స్థానంలో ఉండేవారు. యూపీఏ హ‌యాంలో కేంద్ర రైల్వే మంత్రిగా ప‌నిచేశారు. అయితే 2021లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరారు. అయితే ఆ ఏడాది మే నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయ‌న.. నెల తిర‌గ‌కుండానే (జూన్‌లో) మ‌ళ్లీ టీఎంసీలో చేరారు. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం కింద ఆయ‌న స‌భ్య‌త్వాన్ని కోల్‌క‌తా హైకోర్టు ర‌ద్దుచేసింది.

Advertisement
Advertisement