త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Accident | ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

Accident | ఎన్టీఆర్ జిల్లా (NTR District) కంచికచర్ల మండలం కీసర టోల్‌ ప్లాజా (Keesara Tole Plaza) వద్ద ఘోర ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. విజ‌య‌వాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ అదుపుతప్పి కారుపై బోల్తా పడ‌గా కారు నుజ్జునుజ్జయింది.

S

National | Published On Apr 11, 2026, 5.32 pm IST

Accident | ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం
Advertisement
  • కీస‌ర టోల్ ప్లాజా వ‌ద్ద కారుపై ప‌డిన సిమెంట్ ట్యాంక‌ర్‌.. ప్ర‌యాణికుల ప‌రిస్థితి విష‌మం

త్రినేత్ర‌.న్యూస్‌: ఎన్టీఆర్ జిల్లా (NTR District) కంచికచర్ల మండలం కీసర టోల్‌ ప్లాజా (Keesara Tole Plaza) వద్ద ఘోర ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. విజ‌య‌వాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ అదుపుతప్పి కారుపై బోల్తా పడ‌గా కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్నవారికి తీవ్ర గాయాలు కాగా ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే కారులో ఎంతమంది ఉన్నారనేది తెలియడం లేదు. ప్రయాణికులను కాపాడేందుకు టోల్‌ప్లాజా సిబ్బంది, స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్‌కు వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. టోల్‌ప్లాజా దాటుతున్న స‌మ‌యంలో బ్రేక్ ఫెయిల్ కావ‌డంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ట్యాంక‌ర్ డ్రైవ‌ర్ చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కారుపై ప‌డిన ట్యాంక‌ర్‌ను జేసీబీ సాయంతో రెస్క్యూ టీం తొల‌గించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఘ‌ట‌నా స్థ‌లానికి అంబులెన్స్‌లు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. బి. శ్రీ‌నివాస్‌రావు పేరు మీద కారు రిజిస్ట్రేష‌న్ అయి ఉన్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ట్యాంక‌ర్ డ్రైవ‌ర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement