Srinivas Rao Bodduluri | ట్యాంకర్ బోల్తా.. బీఎండబ్ల్యూ కారు నుజ్జునుజ్జు
Srinivas Rao Bodduluri | ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీనివాస్ రావు బొద్దులూరి(65) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రమాదంలో సీనియర్ అడ్వకేట్ మృతి
పలు కీలక కేసులు వాదన
Srinivas Rao Bodduluri | త్రినేత్ర.న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీనివాస్ రావు బొద్దులూరి(65) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రావు ఏపీ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయినప్పటికీ.. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నారు.
కీలక కేసులు వాదన..
శ్రీనివాస్ రావు పలు కీలక కేసులను కూడా వాదించారు. గ్రూప్-2లో దివ్యాంగుల రిజర్వేషన్ల కోసం వాదనలు వినిపించారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి తరపున కూడా వాదించారు.
ప్రమాదం జరిగిందిలా..
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద భారీ సిమెంట్ ట్యాంకర్, బీఎండబ్ల్యూ కారు పక్కపక్క లేన్లలో నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇదే సమయంలో సిమెంట్ ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అవడంతో.. అక్కడున్న డివైడర్‌ను ఎక్కి పక్కనే వెళ్తున్న బీఎండబ్ల్యూ కారుపై పడిపోయింది. దీంతో కారు మొత్తం నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. పూర్తిగా ట్యాంకర్ కారుపై పడిపోవడంతో.. స్థానికులకు వెలికితీసే అవకాశం కూడా లేకుండా పోయింది.
కారులో శ్రీనివాస్ రావు ఒక్కరే..
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూటీమ్ ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను తొలగించారు. ఆ తర్వాత కారులో ఉన్న వ్యక్తిని బయటకు వెలికితీసి.. అడ్వకేట్ శ్రీనివాస్ రావుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో శ్రీనివాస్ రావు ఒక్కరే ఉన్నారని విజయవాడ సీపీ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో నివాసం..
ప్రమాదానికి గురైన కారు నంబర్.. TS 09FT 6662. ఈ కారు శ్రీనివాస్ రావు పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయింది. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడ మారుతీ ఎన్‌క్లేవ్‌లో శ్రీనివాస్ రావు నివాసం ఉంటున్నట్లు రిజిస్ట్రేషన్ ఆధారంగా తేలింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






