త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Errabelli Dayakar Rao | అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలకు తెరలేపిండు : ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు

Errabelli Dayakar Rao | అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన భూ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఖండించారు. తనపై భూ కబ్జా ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. తన వారసత్వ భూములను అమ్ముకొని రాజకీయాలు చేశానే తప్ప.. ఇతరుల మాదిరిగా భూ కబ్జాలకు పాల్పడలేదని వ్యాఖ్యానించారు.

P

Telangana | Published On Sep 17, 2026, 6.33 pm IST

Errabelli Dayakar Rao | అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలకు తెరలేపిండు : ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు
Advertisement

Errabelli Dayakar Rao | అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన భూ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఖండించారు. తనపై భూ కబ్జా ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. తన వారసత్వ భూములను అమ్ముకొని రాజకీయాలు చేశానే తప్ప.. ఇతరుల మాదిరిగా భూ కబ్జాలకు పాల్పడలేదని వ్యాఖ్యానించారు. తనపై, తన నాయకులపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఎర్రబెల్లి అన్నారు. భూ వ్యవహారాలపై దమ్ముంటే హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అధికారులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

అసెంబ్లీలో భూ కుంభకోణాలపై సమగ్ర చర్చకు సిద్ధపడాలని రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా తమ నాయకులు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తారనే ఉద్దేశంతోనే వారిని సభకు రాకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. భూ వ్యవహారాలపై చర్చకు అవకాశం ఇస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్‌పై మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ పదవులను సైతం త్యాగం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామాలకు సిద్ధపడిన సమయంలో రేవంత్‌రెడ్డి తప్పించుకున్నారని విమర్శించారు. తనపై, తమ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఎర్రబెల్లి అన్నారు. ముందుగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ప్రతిష్ఠను, తెలంగాణ పరువును దెబ్బతీసేలా వ్యవహరించవద్దని సూచించారు.

Advertisement
Advertisement