West Bengal | బెంగాల్‌లో మోదీపై దీదీ గెలిచేనా..
West Bengal | పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై (Election Results) సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee), ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ (BJP).. నువ్వానేనా అన్నట్లు ప్రజాక్షేత్రంలో పోరాడాయి.
West Bengal | త్రినేత్ర.న్యూస్: పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై (Election Results) సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee), ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ (BJP).. నువ్వానేనా అన్నట్లు ప్రజాక్షేత్రంలో పోరాడాయి. గత ఎన్నికల్లో భారీగా బలం పుంచుకున్న బీజేపీ దాదాపు మమతను ఓడించినంత పనిచేసింది. ఈసారి బెంగాల్‌లో కచ్చితంగా జెండా పాతాలన్న లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా సహా పార్టీ అగ్రనేతలంతా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు.
ఇక మోదీని ఎలాగైనా నిలువరించాలని పట్టుదలతో ఉన్న దీదీ.. సేవ్ బెంగాల్ నినాదం ఎత్తుకున్నారు. టీఎంసీతో బెంగాల్‌కు శ్రీరామ రక్ష అంటూ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఓవైపు మమత, మరోవైపు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎన్నికల ప్రచార బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. సర్‌తో బెంగాల్‌పై బీజేపీ దురాక్రమణ చేస్తున్నదని, ఓట్ల తొలగింపును తమకు అనుకూలంగా మలచుకునేందుకు అన్నివిధాల ప్రయత్నించారు. కాగా, రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 92.47 శాతం ఓటింగ్ నమోదయింది. మరో గంటలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలు తెరచుకుంటాయి. ఉదయం 10 గంటల తర్వాత ఒక్కొక్కటిగా ఫలితాలపై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో మోదీని దీదీ అడ్డుకోగలదా అని ఫలితాల కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు!..

కాగా, పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండా, ఒక చోట ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించనున్నారు. మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 432 మంది కౌంటింగ్ పరిశీలకులను ఈసీ నియమించింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని 33 నియోజకవర్గాలకు 49 మంది అబ్జర్వర్లను, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 31 స్థానాలకు 45 మంది పరిశీలకులను ఈసీ కేటాయించింది. ముర్షిదాబాద్‌లోని 22 నియోజకవర్గాలకు 33 మంది, డార్జిలింగ్, జల్‌పాయ్‌గుడి, ఉత్తర దినాజ్‌పుర్ వంటి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గానికి ఒక అదనపు పరిశీలకుడిని నియమించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించింది. అయినప్పటికీ ఆదివారం భవానీపూర్ స్థానంలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద బీజేపీ, టీఎంసీ శ్రేణులు ఘర్షణపడ్డాయి.
స్వీట్లు రెడీ
అలాగే, సోమవారం బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో టీఎంసీ, బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నాయి. తమ పార్టీ జెండా రంగులు, నినాదాలకు అనుగుణంగా స్వీట్‌లను సిద్ధం చేశాయి. బీజేపీ కాషాయ వర్ణంలో 'మోదీశ్రీ' పేరిట, ఆకుపచ్చ రంగులో 'జాయ్ బంగ్లా' పేరిట టీఎంసీ, 'లాల్ సలాం' పేరిట వామపక్షాలు మిఠాయిలను సిద్ధం చేశాయి.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






