Supreme Court | ఓట్ల లెక్కింపునకు ముందు టీఎంసీకి షాక్.. పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు..!
Supreme Court | బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్‌కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే తీసుకోవాలంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలను టీఎంసీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
Supreme Court | బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్‌కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే తీసుకోవాలంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలను టీఎంసీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. అధికారులను నియమించుకునే విషయంలో పూర్తి అధికారం ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేసింది. జస్టిస్ జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు అన్ని పార్టీల ఏజెంట్లు హాజరవుతారని గుర్తు చేశారు. ఎన్నికల పరిశీలకులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వారా కాదా అనేది పెద్దగా ప్రభావం చూపబోదని అభిప్రాయపడ్డారు. నియామకం సీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు.
ఇదిలా ఉండగా.. బెంగాల్‌లో రెండు విడుతల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 4న కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఓట్ల లెక్కింపు సిబ్బంది నియామకంపై ఈ వివాదం రాజుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కౌంటింగ్ సూపర్‌వైజర్లుగా నియమించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సమాన అవకాశాలు ఇవ్వాలని టీఎంసీ డిమాండ్ చేస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ బాగ్చి మాట్లాడుతూ కౌంటింగ్ సూపర్ వైజర్, అసిస్టెంట్లుగా ఏ ఉద్యోగులైనా ఉండొచ్చని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని తెలిపారు. దాంతో ఈసీ జారీ చేసిన సర్క్యులర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని చెప్పలేమన్నారు. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులను నియమించుకునే హక్కు కూడా ఉందని స్పష్టం చేసింది.
టీఎంసీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఎన్నికల సంఘం సర్క్యులర్‌లో కేవలం కేంద్ర ఉద్యోగులే ఉంటారని స్పష్టంగా చెప్పలేదని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను దూరంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అయితే, ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. నిబంధనల మేరకు కేంద్రం, రాష్ట్ర ఉద్యోగులను నియమించుకునే స్వేచ్ఛ ఈసీకి ఉందని స్పష్టం చేసింది. టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






