త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tungabhadra Dam Gates | నేడు తుంగ‌భ‌ద్ర డ్యామ్ నూత‌న‌ గేట్లు ప్రారంభం.. హాజ‌రుకానున్న మూడు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు

Tungabhadra Dam Gates | తుంగభద్ర ప్రాజెక్టు (Tungabhadra Project) ముగ్గురు సీఎంల క‌ల‌యిక‌కు వేదిక కానుంది. టీబీ డ్యాంకు కొత్తగా అమర్చిన స్పిల్‌వే గేట్లను (Tungabhadra Dam Gates గురువారం ఘ‌నంగా ప్రారంభించ‌నున్నారు.

G

National | Published On Jun 25, 2026, 7.34 am IST

Tungabhadra Dam Gates | నేడు తుంగ‌భ‌ద్ర డ్యామ్ నూత‌న‌ గేట్లు ప్రారంభం.. హాజ‌రుకానున్న మూడు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు
Advertisement

Tungabhadra Dam Gates | త్రినేత్ర‌.న్యూస్‌: తుంగభద్ర ప్రాజెక్టు (Tungabhadra Project) ముగ్గురు సీఎంల క‌ల‌యిక‌కు వేదిక కానుంది. టీబీ డ్యాంకు కొత్తగా అమర్చిన స్పిల్‌వే గేట్లను (Tungabhadra Dam Gates గురువారం ఘ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ హాజ‌రుకానున్నారు. 2024లో వ‌చ్చిన భారీ వ‌ద‌ల వ‌ల్ల డ్యాంకు చెందిన 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో సీనియ‌ర్ ఇంజినీర్ క‌న్న‌య్య నాయుడు నేతృత్వంలోని నిపుణుల బృందం అత్య‌వ‌స‌ర చ‌ర్య‌గా స్టాప్ లాక్ గేటును అమ‌ర్చింది.

33 కొత్త గేట్లు..

ప్ర‌మాదం నేప‌థ్యంలో డ్యాంలోని అన్ని స్పిల్ వే గేట్ల‌ను పూర్తిగా మార్చాల‌ని జాతీయ డ్యాం భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) సిఫార‌సు చేసింది. దీంతో క‌ర్ణాట‌క‌, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా పాత గేట్ల స్థానంలో 33 గేట్లను కొత్త‌గా అమ‌ర్చాయి. దీనికోసం మొత్తం రూ.51 కోట్లు వెచ్చించాయి. దాదాపు 73 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ తుంగభద్ర ప్రాజెక్టు వ‌ల్ల క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లోని లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు, గ్రామాల‌కు తాగు నీరు అందుతున్న‌ది.

Advertisement
Advertisement