త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Threatening Letters | తస్మాత్ జాగ్రత్త.. న‌లుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు!

Threatening Letters | ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ న‌లుగురు మంత్రులకు (AP Ministers) బెదిరింపు లేఖ‌లు (Threatening Letters) వ‌చ్చాయి. త‌స్మాత్ జాగ్ర‌త్త అని హెచ్చరిస్తూ మావోయిస్టుల (Maoists) పేరుతో లేఖలు రావడం రాష్ట్రంలో క‌లక‌లం సృష్టిస్తున్న‌ది.

G

National | Published On Feb 11, 2026, 12.47 pm IST

Threatening Letters | తస్మాత్ జాగ్రత్త.. న‌లుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు!
Advertisement

Threatening Letters | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ న‌లుగురు మంత్రులకు (AP Ministers) బెదిరింపు లేఖ‌లు (Threatening Letters) వ‌చ్చాయి. త‌స్మాత్ జాగ్ర‌త్త అని హెచ్చరిస్తూ మావోయిస్టుల (Maoists) పేరుతో లేఖలు రావడం రాష్ట్రంలో క‌లక‌లం సృష్టిస్తున్న‌ది. జాగ్రత్తగా ఉండాలంటూ మంత్రులు కందుల దుర్గేశ్ (Kandula Durgesh), అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, కొల్లు ర‌వీంద్ర‌, స‌త్య‌కుమార్‌కు అజ్ఞాత వ్య‌క్తులు లేఖ‌లు పంపించారు. కాగా, మావోయిస్టుల పేరుతో పోస్టు ద్వారా ఈ లేఖ‌లు వ‌చ్చాయ‌ని మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. అయితే ఒకే విధమైన సందేశంతో మంత్రులకు లేఖలు రావడంతో దీనివెనుక ఎవరు ఉన్నారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారర‌ని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. త‌న‌కు చాలా మంది ఫోన్లు చేశారని తెలిపారు. తాను పనిచేసేది టూరిజం లాంటి చిన్న శాఖ అని, దీంట్లో మావోయిస్టులు లేక రాయాల్సినంత పెద్ద హడావిడి ఏముంటుందని చెప్పారు. వ్యక్తిగతంగా, శాఖ పరంగా ఎక్కడా ఎలాంటి తప్పులు లేవ‌న్నారు. మావోయిస్టుల లేఖ‌లు ఇలా ఉండ‌వ‌ని, ఎవరో ఉద్దేశపూర్వకంగానే రాసి ఉంటారని సందేహం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే తాను పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement