Delhi | తప్పు జరిగింది.. క్షమించండి : కారు నడిపి వ్యక్తి మృతికి కారణమైన మైనర్ బాలుడి తండ్రి
Delhi | న్యూఢిల్లీ (Delhi)లోని ద్వారక (Dwarka) సౌత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఓ మైనర్ బాలుడు కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Delhi | న్యూఢిల్లీ (Delhi)లోని ద్వారక (Dwarka) సౌత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఓ మైనర్ బాలుడు కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కారు నడిపిన బాలుడి తండ్రి తాజాగా స్పందించారు. ఈ మేరకు తప్పును అంగీకరిస్తూ.. బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. అంతేకాదు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని కూడా తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ఇది నా కొడుకు చేసిన ఘోరమైన తప్పిదం. అందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. ప్రమాద సమయంలో నా కొడుకు, కూతురు కారులోనే ఉన్నారు. ఆ సమయంలో నేను పనినిమిత్తం గోరఖ్‌పూర్ వెళ్లా. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం సమయంలో నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. వెంటనే నేను బయల్దేరి ఢిల్లీకి వచ్చా. ఇంట్లో ఎవరికీ తెలియకుండా కారు తాళాలు తీసుకెళ్లాడు. నేను ఇక్కడే ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. నా కుమారుడు చేసిన పనికి నేను సిగ్గుపడుతున్నాను. నేనూ ఓ తండ్రినే. బాధిత కుటుంబం బాధను అర్థం చేసుకోగలను. బాధిత కుటుంబానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాను" అని ఆయన పేర్కొన్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
న్యూఢిల్లీలోని ద్వారక సౌత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో లాల్ బహదూర్ శాస్త్రి కాలేజీ సమీపంలో ఫిబ్రవరి 3న జరిగిన ఈ ప్రమాదంలో సాహిల్ ధనేశ్రా (Sahil Dhaneshra) అనే వ్యక్తి మృతి చెందాడు. హైస్పీడ్‌లో వెళ్తున్న స్కార్పియో ఎదురుగా వస్తున్న బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ మీద వస్తున్న సాహిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌తో పాటు స్విఫ్ట్ డిజైర్ కారు కూడా ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కార్పియో నడిపిన 17 ఏళ్ల టీనేజర్‌ని అదుపులోకి తీసుకొని జువెనైల్ జస్టిస్ బోర్డ్ ముందు ప్రవేశపెట్టారు. అనంతరం అతడిని అబ్జర్వేషన్ హోమ్‌కి పంపించారు. ఫిబ్రవరి 10న అతడికి బోర్డు మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది. త్వరలో అతడికి క్లాస్ 10 బోర్డు పరీక్షలు ఉన్నాయని చెప్పి అతడికి తాత్కాలికంగా పరీక్షలు రాసే వరకు అనుమతి ఇచ్చింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






