త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | భార‌త్‌కు కాంగ్రెస్ ఎప్పుడూ మంచి చేయ‌దు : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

PM Modi | ఈ ఏడాది అసోంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. త్వ‌ర‌లో ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉన్న‌ది. ఈక్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ‌నివారం ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వం చేశారు.

P

National | Published On Feb 14, 2026, 6.08 pm IST

PM Modi | భార‌త్‌కు కాంగ్రెస్ ఎప్పుడూ మంచి చేయ‌దు : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ
Advertisement

PM Modi | ఈ ఏడాది అసోంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. త్వ‌ర‌లో ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉన్న‌ది. ఈక్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ‌నివారం ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వం చేశారు. ఈ సంద‌ర్భంగా గువాహ‌టిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. బీజేపీ చేసిన అభివృద్ధిని వివ‌రించ‌డంతో పాటు కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ ఉగ్ర‌వాదుల‌కు మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని ఆరోపించారు. కాంగ్రెస్ నేత‌లంతా చొర‌బాటుదారుల‌ను ర‌క్షించ‌డంలో బిజీగా ఉన్నార‌న్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఈశాన్య ప్రాంతాల‌కు నిధులు కేటాయించ‌కుండా త‌ప్పించుకుంద‌న్నారు.

ఉగ్ర‌వాదుల‌ను శిక్షించ‌డం ప్ర‌పంచం మొత్తం చూసింది..

ఎన్డీయే ప్ర‌భుత్వ హ‌యాంలో భాస్క‌ర్ సేతు స‌హా అనేక ప్రాజెక్టుల‌ను చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. పుల్వామా ఉగ్ర‌దాడి జ‌రిగి ఏడేళ్ల‌యిన నేప‌థ్యంలో ప్ర‌ధాని స్పందించారు. ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయిన భర‌త‌మాత బిడ్డ‌ల‌కు వంద‌నం చేస్తున్నాన‌న్నారు. ఈ దాడి త‌ర్వాత భార‌త్ ఉగ్ర‌వాదుల‌ను ఎలా శిక్షించిందో మొత్తం ప్ర‌పంచం చూసింద‌న్నారు. పుల్వామా ఉగ్ర‌దాడిని ప్ర‌స్తావిస్తూ.. ఆప‌రేష‌న్ సిందూర్‌తో భార‌త‌శ‌క్తిని చూశార‌న్నారు. దేశ ప్ర‌యోజ‌నాల విష‌యంలో ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకునే శ‌క్తి కాంగ్రెస్‌కు ఉందా? అని తెలుసుకోవాల‌నుకుంటున్నాన‌న్న ఆయ‌న‌.. వారు చేయ‌గ‌లిగింద‌ల్లా ఒక ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డ‌మేన‌ని ఎద్దేవా చేశారు. భార‌త్‌ను ఒక దేశంగా ప‌రిగ‌ణించేందుకు కూడా నిరాక‌రించే కాంగ్రెస్‌.. భ‌ర‌త‌మాత అంటే ఏంటో ప్ర‌శ్నించే.. క‌నీస గౌర‌వం చూప‌ని కాంగ్రెస్ భార‌త్‌కు ఎప్ప‌టికీ మంచి చేయ‌లేద‌ని విమ‌ర్శించారు.

కాంగ్రెస్‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న ప్ర‌ధాని..

స్వాతంత్య్రం స‌మ‌యంలో ముస్లిం లీగ్ దేశాన్ని విజ‌భించింద‌న్న ప్ర‌ధాని.. నేటి కాంగ్రెస్ ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్‌గా మారింద‌ని విమ‌ర్శించారు. దేశాన్ని ముక్క‌లు చేయాల‌ని, ఈశాన్య ప్రాంతాల‌ను భార‌త్ నుంచి వేరు చేయాల‌ని నినాదాలు చేసే వారికి కాంగ్రెస్ స‌మ‌ర్థిస్తుంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. బీజేపీ ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి భారీగా నిధ‌/ల‌ఉ కేటాయించింద‌న్నారు. కాంగ్రెస్ పాల‌న‌లో అసోం ఎలా ఆక‌లితో అల‌మ‌టించిందో అంద‌రికీ ఈ విష‌యం గుర్తుండే ఉంటుంద‌న్నారు. గ‌త 11 ఏళ్లుగా రూ.5.50ల‌క్ష‌ల కోట్ల‌కుపైగా అభివృద్ధికి నిధులు కేటాయించింద‌ని. ఈ ఏడాది క‌నెక్టివిటీ విష‌యంలో దృష్టి సారించామ‌న్నారు.

అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం..

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అసోంలో ప‌లు ప్రాజెక్టుల‌కు ప్రారంభోత్స‌వం చేశారు. బ్ర‌హ్మ‌పుత్ర న‌దిపై కొత్త‌గా రూ.3,030 కోట్ల‌తో నిర్మించిన ఆరులైన్ల వంతెన కుమార భాస్క‌ర్ వ‌ర్మ సేతును ప్రారంభించారు. అంత‌కుముందు చ‌బువాలో దిబ్రూగ‌ఢ్ జిల్లాలో మోరాన్ వ‌ద్ద ఈశాన్య రాష్ట్రంలో తొలిసారిగా అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ ఫెసిలిటీకి ప్రారంభోత్స‌వం చేశారు. జాతీయ ర‌హ‌దారి-37పై దాదాపు రూ.100కోట్ల వ్య‌యంతో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని సైనిక‌, పౌర విమానాల కోసం భార‌త వైమానిక ద‌ళం స‌మ‌న్వ‌యంతో అభివృద్ధి చేశారు.

అవ‌స‌ర‌మైతే దిబ్రూగ‌ఢ్ విమానాశ్ర‌యానికి ప్ర‌త్యామ్నాయంగా ల్యాండింగ్ సైట్‌గానూ ప‌ని చేస్తుంది. ఇక్కడ మొద‌ట సుఖోయ్‌-30 ఎంకేఐ, ఆ త‌ర్వాత ర‌ఫేల్‌, ఐఏఎఫ్ ఏఎన్‌32 ర‌వాణా విమానం 'టచ్ అండ్ గో'ను ప్రదర్శించించారు. అలాగే, మోదీ గౌహ‌తిలో ఐఐఎం గౌహ‌తి తాత్కాలిక క్యాంప‌స్‌ని వ‌ర్చువ‌ల్‌గా, కామ్రూప్ జిల్లాలోని అమింగావ్‌లో ఈశాన్య ప్రాంతం కోసం జాతీయ డేటా సెంటర్ (NDC)ని ప్రారంభించారు. అలాగే, పీఎం-ఈబ‌స్ స్కీమ్ కింద 225 ఎల‌క్ట్రిక్ బ‌స్‌ల‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో వంద గౌహ‌తికి, 50 బ‌స్సుల‌ను నాగ్‌పూర్‌, భావ్‌న‌గ‌ర్‌ల‌కు, 25 బ‌స్‌ల‌ను చండీగ‌ఢ్‌కు కేటాయించారు.

Advertisement
Advertisement