Vandebharat Sleeper | పట్టాలెక్కిన వందేభారత్ స్లీపర్.. జెండా ఊపిన ప్రధాని
Vandebharat Sleeper | భారతీయ రైల్వే (Indian Railways) చరిత్రలో నూతన శకానికి నాంది పలికిన వందేభారత్ (Vande Bharat) రైళ్లలో మరో ఆధునిక మేళవింపు చోటు చేసుకుంది. దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ (Vandebharat Sleeper) రైలును ప్రధాని (PM) నరేంద్ర మోడీ (Narendra Modi) శనివారం జెండా ఊపి ప్రారంభించారు.
Vandebharat Sleeper | త్రినేత్ర.న్యూస్ : భారతీయ రైల్వే (Indian Railways) చరిత్రలో నూతన శకానికి నాంది పలికిన వందేభారత్ (Vande Bharat) రైళ్లలో మరో ఆధునిక మేళవింపు చోటు చేసుకుంది. దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ (Vandebharat Sleeper) రైలును ప్రధాని (PM) నరేంద్ర మోడీ (Narendra Modi) శనివారం జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జెండా ఊపి ప్రారంభించిన ఈ రైలు అదే రాష్ట్రంలోని హౌరా నుంచి అసోం రాష్ట్రం గౌహతి (కామాఖ్య) మధ్య రాకపోకలు సాగించనుంది. అదే సమయంలో గౌహతి నుంచి హౌరా మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలును కూడా ఆయన వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అంతకుముందుగా ప్రధాని ఆ రైళ్లో ప్రయాణించే విద్యార్థులతో మాట్లాడారు. రైలు లోపలికి వెళ్లి, రైలులోని సౌకర్యాలను పరిశీలించారు.
అతివేగంగా.. అతిసౌఖ్యంగా..
వందేభారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. తుదిపరీక్షల్లో వందేభారత్ స్లీపర్ రైలు ఈ వేగాన్ని సాధించింది. గాజు గ్లాసుల్లో నీళ్లు నింపి, ఒకదానిపై మరొకటి ఉంచి రైలులో ఉంచినా ఏ మాత్రం కదలలేదని గతంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఈ రైళ్లో ఒకేసారి 800 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. ఇందులో ప్రయాణిస్తే విమానంలో ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. కనీస చార్జి రూ.960తో టికెట్ ప్రారంభమవుతుంది. అత్యాధునిక సాంకేతికతతో ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. దానితో పాటు సీసీ కెమెరాలతో నిఘా, అత్యాధునిక అగ్నిప్రమాద నిరోధక వ్యవస్థలతో రైలును తీర్చిదిద్దారు. రైలుకు ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్, అధునాతన టాయిలెట్లు, రీడింగ్ లైట్స్, చార్జింగ్ పాయింట్లు అమర్చారు.
అన్నీ ఏసీ స్లీపర్ కోచ్‌లే..
ఈ రైళ్లో మొత్తం 16 కోచ్‌లు ఉండగా, అందులో 11 థర్డ్ ఏసీ, 4 సెకెండ్ ఏసీ, 1 ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ప్రయాణీకులకు ప్రీమియం బెడ్‌రోల్స్, అధిక నాణ్యత దుప్పట్లు, ప్రయాణ సమయంలో క్యాటరింగ్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్ల కంటే ఛార్జీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్‌లు ఈ రైళ్లలో ఉండబోవు. ఈ రైలుకు 60 రోజుల ముందు నుంచే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అన్ని బెర్తులు అప్పటి నుంచే అందుబాటులో ఉంటాయి. అలాగే మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు వారి కోటా ప్రకారం టిక్కెట్ల బుకింగ్ ఉంటుంది. ఈ రైలులో ఇతర కోటాలకు అవకాశం లేదు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






