త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

VC Sajjanar | ఇన్‌ఫ్లుయెన్సర్ల‌కు సీపీ స‌జ్జ‌నార్ వార్నింగ్‌

VC Sajjanar | సోష‌ల్ మీడియాలో త‌మ‌కు ఉన్న క్రేజ్‌ను పెట్టుబ‌డిగా మార్చి.. ల‌క్కీ డ్రాల పేరుతో అమాయ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

P

Hyderabad | Published On Jan 17, 2026, 4.49 pm IST

VC Sajjanar | ఇన్‌ఫ్లుయెన్సర్ల‌కు సీపీ స‌జ్జ‌నార్ వార్నింగ్‌
Advertisement
  • లక్కీ డ్రాల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌
  • చ‌ట్టం నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోలేర‌న్న సీపీ

VC Sajjanar | సోష‌ల్ మీడియాలో త‌మ‌కు ఉన్న క్రేజ్‌ను పెట్టుబ‌డిగా మార్చి.. ల‌క్కీ డ్రాల పేరుతో అమాయ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం 'ఎక్స్‌' వేదికగా ఆయన స్పందించారు. గతంలో బెట్టింగ్‌ యాప్‌లను ప్రచారం చేసిన కొందరు, ఆ అక్రమ దందాకు అడ్డుకట్ట పడడంతో ఇప్పుడు ల‌క్కీ డ్రాల పేరిట కొత్త అవ‌తారం ఎత్తార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కార్లు, ఖరీదైన బైకులు, ఇళ్లు, డీజే సెట్లు బహుమతులుగా ఇస్తామంటూ జ‌నానికి ఎర వేసి, నిలువునా మోసం చేస్తున్నారన్నారు.

రీల్స్‌లో ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ, వాస్తవంలో మోసాలకు పాల్పడుతున్న పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోలను ఆయ‌న 'ఎక్స్‌'లో షేర్‌ చేశారు. మోసాలకు పాల్పడే వారిపై 'ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ - 1978' కింద కేసులు నమోదు చేస్తామని సజ్జనార్ హెచ్చ‌రించారు. ఇందులో సినీ సెల‌బ్రిటీలైనా, సోష‌ల్ మీడియా స్టార్స్ అయినా చ‌ట్టప‌ర‌మైన చ‌ర్య‌ల నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోలేర‌ని స్ప‌ష్టం చేశారు. లక్కీ డ్రాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను సీపీ కోరారు. డయల్ 100 గానీ, హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ నెంబర్ 94906 16555 గానీ వివ‌రాలు పంపాల‌ని కోరారు. స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రలోభాలకు గురిచేసే మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఆయ‌న సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement