Murder | భార్య చీరలతో ముగ్గురు బిడ్డలకు ఉరి.. ఆపై ఆత్మహత్య
Murder | ఇది హృదయ విదారక ఘటన. భార్య చీరలతో తన ముగ్గురు బిడ్డలకు ఉరేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
Murder | ఇది హృదయ విదారక ఘటన. భార్య చీరలతో తన ముగ్గురు బిడ్డలకు ఉరేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్‌పూర్ జిల్లాలోని మిశ్రౌలియా గ్రామానికి చెందిన అమర్నాత్ రామ్‌కు కొన్నేండ్ల క్రితం పెళ్లైంది. ఆయనకు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. గతేడాది భార్య చనిపోగా, పిల్లల ఆలనాపాలనా తానే చూసుకుంటున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ.. తన ముగ్గురు ఆడబిడ్డలకు భార్య చీరలతో ఉరేశాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఐదుగురిలో ఇద్దరు మగ పిల్లలు ఈ ఘటన నుంచి తప్పించుకున్నారు. మృతి చెందిన పిల్లలను అనురాధ(12), శివాని(7), రాధిక(6)గా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మగపిల్లలను శివమ్(6), చందన్(5)గా గుర్తించారు.
ఈ ఘటనపై పలు సందేహాలు
అమర్నాథ్ తన పిల్లలకు ఉరేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భార్య చనిపోయాక పిల్లల పోషణ అమర్నాథ్‌కు భారంగా మారిందని, ఈ నేపథ్యంలో వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని స్థానికులు భావించారు. ప్రయివేటు ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని, ఈ క్రమంలోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని మరికొందరు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వివరాలు మరిన్ని తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పిల్లలను ఎందుకు చంపాల్సి వచ్చింది..? అమర్నాథ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రాత్రి భోజనం కోడిగుడ్ల కూరతో..
తండ్రి అమర్నాథ్ ఈ అఘాయిత్యానికి పాల్పడే ముందు పిల్లలకు కోడిగుడ్ల కూరతో భోజనం వడ్డించిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ తర్వాత పిల్లలందర్నీ వరుసగా నిలబెట్టి.. భార్య చీరలతో ఉరేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు మగ పిల్లలు ఈ ఘటన నుంచి తప్పించుకున్నారు. ఆరేండ్ల శివమ్ మాట్లాడుతూ.. తాను తన తండ్రి ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్న సమయంలోనే తన అక్కలకు ఉరేసినట్లు తెలిపాడు.
సంబంధిత వార్తలు

Hydroponic Farm | హైడ్రోఫోనిక్ వ్యవసాయం.. ఎకరాకు రూ. 57 లక్షలు సంపాదిస్తున్న ఐఐఎం ఎంబీఏ గ్రాడ్యుయేట్
మే 19, 2026

Bihar Cabinet Expansion | బీహార్‌లో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ తనయుడు
మే 7, 2026

Samrat Choudhary | బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణం.. ఆ పదవి చేపట్టిన తొలి నేతగా రికార్డు
ఏప్రిల్ 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



