త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Princess Sirivannavari | భార‌త ప‌ర్య‌ట‌న‌కు థాయ్ యువ‌రాణి.. జైపూర్‌లో నాలుగు రోజులు ప‌ర్య‌టించ‌నున్న రాజ‌క‌న్య‌

Princess Sirivannavari | థాయ్‌లాండ్ రాజకుటుంబానికి చెందిన యువరాణి సిరివన్నవారి నారీరతన రాజకన్య నాలుగు రోజులు రోజుల పాటు భార‌త్‌లో ప‌ర్య‌టించారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె ప్రత్యేక విమానంలో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

P

National | Published On Feb 6, 2026, 10.00 pm IST

Princess Sirivannavari | భార‌త ప‌ర్య‌ట‌న‌కు థాయ్ యువ‌రాణి.. జైపూర్‌లో నాలుగు రోజులు ప‌ర్య‌టించ‌నున్న రాజ‌క‌న్య‌
Advertisement

Princess Sirivannavari | థాయ్‌లాండ్ రాజకుటుంబానికి చెందిన యువరాణి సిరివన్నవారి నారీరతన రాజకన్య నాలుగు రోజులు రోజుల పాటు భార‌త్‌లో ప‌ర్య‌టించారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె ప్రత్యేక విమానంలో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 10 వరకూ కొనసాగనున్న ఈ పర్యటనలో జైపూర్, జోధ్‌పూర్ నగరాల్లోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలను ఆమె సంద‌ర్శిస్తారు.

యువరాణి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో పోలీస్ శాఖతో పాటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భారీగా భద్రతా చర్యలు చేపట్టింది. దౌత్య నియమావళి ప్రకారం సాధారణ ప్రజలు ఫోటోలు, వీడియోలు తీసేందుకు పరిమితులు విధించారు. విమానాశ్రయం నుంచి యువరాణి నేరుగా కాన్వాయ్ ద్వారా రామ్‌బాగ్ ప్యాలెస్ హోటల్‌కు చేరుకున్నారు. జైపూర్‌లో ఆమె అక్కడే బస చేయనున్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్ సంప్రదాయ అతిథి సత్కారాన్ని ప్రతిబింబించే ‘అతిథి దేవో భవ’ సంస్కృతిని ఆమెకు పరిచయం చేయనున్నారు.

పర్యటనలో భాగంగా జైపూర్‌లోని అమెర్ ఫోర్ట్, హవా మహల్, సిటీ ప్యాలెస్‌తో పాటు ప్రసిద్ధ త్రిపోలియా బజార్‌ను ఆమె సందర్శించనున్నారు. అనంతరం జోధ్‌పూర్‌కు వెళ్లి మెహ్రాన్‌గఢ్ కోట, ఉమైద్ భవన్ ప్యాలెస్, జస్వంత్ థాడా వంటి చారిత్రక కట్టడాలను వీక్షించనున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్–థాయ్‌లాండ్ మధ్య సాంస్కృతిక, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని అధికారులు పేర్కొన్నారు.

యువరాణి సిరివన్నవారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఫ్యాషన్ డిజైనర్‌గా పేరొందారు. ఆమెకు సొంతంగా ఒక లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఉంది. థాయ్ రాయల్ ఆర్మీలో మేజర్ హోదాలో ఆమె సేవలందిస్తున్నారు. క్రీడలు, కళల పట్ల అపార‌మైన మ‌క్కువ ఉన్న‌ది. యువరాణి పర్యటన నేపథ్యంలో రాజ‌స్థాన్ ప్రభుత్వం భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ప్రోటోకాల్ అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించింది.

Advertisement
Advertisement