Iran | ఎఫ్-15తో పాటు 180 డ్రోన్లను కూల్చివేశాం..! సైనిక శక్తిపై ప్రపంచానికి ఇరాన్ సందేశం..!
Iran | ఇరాన్ మరోసారి తన సైనిక సామర్థ్యాలపై కీలక ప్రకటనలు చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ ఘలిబాఫ్ మాట్లాడుతూ తమ సేనలు సుమారు 180 డ్రోన్లను నిర్వీర్యం చేశాయని, అమెరికాకు చెందిన ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.
Iran | ఇరాన్ మరోసారి తన సైనిక సామర్థ్యాలపై కీలక ప్రకటనలు చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ ఘలిబాఫ్ మాట్లాడుతూ తమ సేనలు సుమారు 180 డ్రోన్లను నిర్వీర్యం చేశాయని, అమెరికాకు చెందిన ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ఇది ఒక్కసారి జరిగిన ఘటన కాదని.. ఇరాన్ సాంకేతికత, వ్యూహాత్మక సామర్థ్యాలకు ఉదాహరణగా పేర్కొన్నారు. వాషింగ్టన్‌తో కొనసాగుతున్న పరోక్ష చర్చల ప్రస్తుత స్థితిపై అధికారులకు వివరించే సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఇరాన్ వార్తా సంస్థ వెల్లడించింది.
అత్యాధునిక ఫైటర్‌జెట్ అయిన ఎఫ్-35ని లక్ష్యం చేసుకోవడం తమ రక్షణ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నదానికి నిదర్శనమని ఘలిబాఫ్ పేర్కొన్నారు. ఈ చర్యను పలు స్థాయిల్లో ప్రణాళికాబద్ధంగా అమలు చేశామని చెప్పారు. గతంలో ఇరాన్ చేసిన ప్రకటనను గతంలో అమెరికా ఖండించింది. పలు నివేదికల ప్రకారం.. ఎఫ్-15 విమానం దెబ్బతినడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లుగా సమాచారం. ఈ విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. డ్రోన్ దాడుల విషయంలోనూ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా, దాని మిత్రదేశాలకు చెందిన సుమారు 180 డ్రోన్లను కూల్చివేశామని తెలిపింది. గతంలో కూడా భారీ సంఖ్యలో డ్రోన్లను అడ్డుకున్నామని ఇరాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ప్రాంతీయ యుద్ధ వ్యూహాల్లో డ్రోన్లు, వైమానిక దాడులు కీలకంగా మారుతున్న సమయంలో ఇరాన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో జరుగుతున్న చర్చలపై ఘలిబాఫ్ మాట్లాడుతూ కొన్ని అంశాల్లో అంగీకారం కుదిరినప్పటికీ ఇంకా పలు కీలక భేదాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. పాశ్చాత్య దేశాల ఒత్తిడి పనిచేయలేదని, అందుకే ఇప్పుడు చర్చల మార్గాన్ని ఎంచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన కాల్పుల విరమణను ఇరాన్ వ్యూహాత్మక విజయంగా అభివర్ణించగా, అమెరికా దీనిపై భిన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరాన్‌లో పాలనా మార్పు తీసుకురావడం, దేశ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడం వంటి లక్ష్యాలను అమెరికా సాధించలేకపోయిందని ఘలిబాఫ్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ
జులై 6, 2026

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026
తాజావార్తలు
- ●Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..
- ●Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ
- ●Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..
- ●TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..

Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ

Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..

TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు



