త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu | ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయిన మంత్రి కీర్తన.. అసలు కారణం ఏంటంటే..?

P

National | Published On May 12, 2026, 7.38 am IST

Tamil Nadu | ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయిన మంత్రి కీర్తన.. అసలు కారణం ఏంటంటే..?
Advertisement

Tamil Nadu | తమిళనాడు అసెంబ్లీలో సోమవారం ఎమ్మెల్యే ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అయితే, రాష్ట్ర మంత్రి ఎస్‌ కీర్తన మాత్రం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయారు. ఎన్నికల ధ్రువీకరణ పత్రం సమర్పించకపోవడంతో ఆమె ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వలేదు. అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ కే శ్రీనివాసన్ ఆమె పేరును పిలిచి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఆ సమయంలో ఎన్నికల సంఘం సర్టిఫికెట్ చూపించాలని కోరారు. అయితే, కీర్తన ఆ పత్రాన్ని సమర్పించలేకపోయారు. ఆమె ఇచ్చిన సమాధానం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు. సంబంధిత అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. అవసరమైన ధ్రువీకరణ పత్రం సమర్పించపోవడంతోనే ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు.

సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత ఎప్పుడైనా ఆమె ప్రమాణం చేయవచ్చని చెప్పారు. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా తమ ఎన్నికల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని ముందస్తుగానే సమాచారం అందించామని, ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా అధికారికంగా స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన సీఎం జోసెఫ్‌ విజయ్‌ సహా అందరు ఎమ్మెల్యేలు తమ ఈసీ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించారని, అనంతరం రాజ్యాంగ ప్రకారం ప్రమాణ స్వీకారం చేసినట్లు సమాచారం. శివకాశి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కీర్తన ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జీ అశోకన్‌పై 11,670 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత కెటి రాజేంద్ర బాలాజీ ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమయ్యారు.

Advertisement
Advertisement