Tamil Nadu | ఆస్తుల వివరాలు ఇస్తేనే ప్రమోషన్.. ఉద్యోగులకు సర్కారు ఆదేశాలు..
Tamil Nadu | ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతికి ఆస్తుల వివరాలను ఇవ్వడాన్ని తమిళనాడు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నెల 31లోగా ఉద్యోగులంతా తమ ఆస్తులు, పొదుపులు, రుణాల వివరాలను ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IFHRMS) వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Tamil Nadu | ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతికి ఆస్తుల వివరాలను ఇవ్వడాన్ని తమిళనాడు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నెల 31లోగా ఉద్యోగులంతా తమ ఆస్తులు, పొదుపులు, రుణాల వివరాలను ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IFHRMS) వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు తమ స్థిర, చర ఆస్తులతోపాటు పొదుపులు, అప్పులు, ఇతర ఆర్థిక బాధ్యతలను వెల్లడించాల్సి ఉంటుంది. ఇతరుల పేరుతో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను కూడా డిక్లరేషన్‌లో పొందుపరచాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
అలాంటి సందర్భాల్లో ఆస్తి ఎవరి పేరుతో ఉందో, ఉద్యోగితో వారి సంబంధం ఏమిటో కూడా పేర్కొనాలి. గడువులోగా వివరాలు సమర్పించిన ఉద్యోగులను మాత్రమే పదోన్నతి జాబితాలో పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్ణీత సమయంలో ఆస్తుల వివరాలు సమర్పించకపోతే ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తామని పేర్కొంది. ఉద్యోగులు తమ ఆస్తులు, పొదుపులు మాత్రమే కాకుండా రుణాలు, ఇతర బకాయిల వివరాలను కూడా ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ పరిధిలోని సంబంధిత ఉద్యోగులందరూ నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?






