త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kia Sonnet diwali bonus to employees | దీపావళి గిఫ్ట్ అంటే.. ఆ కంపెనీలో కారే.. ఎంతమంది ఉద్యోగులకు ఇచ్చారో తెలుసా..?

Kia Sonnet diwali bonus to employees | దీపావ‌ళి సంద‌ర్భంగా త‌న ఉద్యోగుల‌కు ఓ ఫార్మా సంస్థ వ‌రాల జ‌ల్లు కురిపించింది (Kia Sonnet diwali bonus to employees). సంస్థలో ఎంతో న‌మ్మ‌కంగా అంకితభావంతో పనిచేస్తున్న ప‌లువురు ఉద్యోగుల‌కు స‌రికొత్త కియా సోనెట్ (Kia Sonnet) ఎస్‌యూవీ కార్ల‌ను బ‌హుమ‌తిగా అందించింది.

D

National | Published On Oct 27, 2026, 4.08 pm IST

Kia Sonnet diwali bonus to employees | దీపావళి గిఫ్ట్ అంటే.. ఆ కంపెనీలో కారే.. ఎంతమంది ఉద్యోగులకు ఇచ్చారో తెలుసా..?
Advertisement

Kia Sonnet diwali bonus to employees | త్రినేత్ర న్యూస్ : ఉద్యోగాల కోతలు (Layoffs), వ్యయ నియంత్రణ చర్యల కారణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక కంపెనీల్లో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న‌ ప్ర‌స్తుత త‌రుణంలో.. చండీగఢ్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ గొప్ప మ‌న‌సు చాటుకుంది. దీపావ‌ళి బోన‌స్‌గా (diwali bonus) త‌న ఉద్యోగుల‌కు ఊహించిన గిఫ్ట్స్ ఇచ్చి వార్త‌ల్లో నిలిచింది. సంస్థలో ఎంతో న‌మ్మ‌కంగా అంకితభావంతో పనిచేస్తున్న ప‌లువురు ఉద్యోగుల‌కు స‌రికొత్త కియా సోనెట్ (Kia Sonnet) ఎస్‌యూవీ కార్ల‌ను బ‌హుమ‌తిగా అందించింది.

పంచకులలో గల మిట్స్‌ హెల్త్‌ కేర్‌ ఫార్మా సంస్థ (MITS Group of Companies) డైరెక్టర్‌ ఎంకే భాటియా (MK Bhatia) తన సంస్థ‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన న‌లుగురు ఉద్యోగుల‌కు ఈ ఏడాది దీపావ‌ళి కానుక‌గా ఈ కార్ల‌ను బ‌హుమ‌తిగా అంద‌జేశారు. బీఎండ‌బ్ల్యూ 3 సిరీస్ గ్రాండ్ లిమోసిన్ కారులో వేదిక వ‌ద్ద‌కు చేరుకున్న భాటికా.. డ‌ప్పు చ‌ప్పుళ్ల మ‌ధ్య కార్ల‌ను ఉద్యోగుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారిని అభినందించారు. అనంత‌రం కానుక‌లు అందుకున్న న‌లుగురు ఉద్యోగులు కేక్ క‌ట్ చేసి స‌హోద్యోగుల‌తో త‌మ ఆనందాన్ని పంచుకున్నారు.

ఉద్యోగుల‌కు కార్ల ప‌థ‌కం..

కాగా, ఈ సంస్థ త‌న ఉద్యోగుల‌కు కార్ల‌ను బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం ఇదేమీ తొలిసారి కాదు. గ‌త మూడేళ్ల నుంచే ఇదే ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తూ వ‌స్తోంది. ఐదేళ్ల‌కు పైగా సంస్థ‌లో ఎంతో న‌మ్మ‌కంగా ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు ఈ అసాధార‌ణ బ‌హుమ‌తి అందిస్తోంది. ఈ పథకం కింద లబ్ధి పొందిన ఉద్యోగులకు కారు పూర్తిగా ఉచితం అవుతుంది. కారు కొనుగోలుకు సంబంధించి 30 శాతం డౌన్ పేమెంట్ (Down Payment)ను కంపెనీయే చెల్లిస్తుంది. నెల‌వారీ ఈఎంఐ మొత్తాన్ని ఆ ఉద్యోగి కంపెనీలో ప‌నిచేస్తున్నంత కాలం అత‌ని జీతంలోనే స‌ర్దుబాటు చేస్తారు.

అయితే, ఆ మినహాయించే ఈఎంఐ మొత్తానికి సమానంగా ఉద్యోగి జీతాన్ని (Salary Hike) కూడా కంపెనీ పెంచుతుంది. దీనివల్ల ఉద్యోగి జేబులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయ‌న‌క్క‌ర్లేదు. ఇక కారు రిజిస్ట్రేష‌న్ కూడా కంపెనీ పేరిట కాకుండా.. నేరుగా ఉద్యోగుల పేర్ల‌పైనే రిజిస్ట‌ర్ చేయ‌డం విశేషం. అంతేకాదండోయ్‌.. కార్లు పొందిన ఉద్యోగుల వ్యక్తిగత ప్రయాణాల కోసం కంపెనీ ప్రతి నెలా ఏకంగా రూ. 2,500 ఇంధన భత్యాన్ని (Fuel Allowance) కూడా అందిస్తుంది. కంపెనీ పనిమీద తిరిగే మైలేజీకి విడిగా డబ్బులు చెల్లిస్తార‌ట‌.

కొత్త ఉద్యోగులకు లక్కీ డ్రా

ఐదేళ్ల‌కు పైగా కంపెనీతో ఉన్న‌వారితోపాటూ కొత్త ఉద్యోగుల కోసం భాటియా ఈ ఏడాది ల‌క్కీ డ్రా విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ ల‌క్కీ డ్రాలో ఒక్క కారు కోసం ఏకంగా 36 మంది కొత్త ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందులో విజేత‌గా నిలిచిన ఉద్యోగి ఎలాంటి ఈఎంఐలు, అద‌న‌పు ఖ‌ర్చులు లేకుండానే కారును సొంతం చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తున్నారు.

గ‌తేడాది రికార్డు స్థాయిలో 51 కార్లు

గ‌తేడాది అక్టోబ‌ర్‌లో దీపావ‌ళి సంద‌ర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఏకంగా 51 వాహనాలను బ‌హుమ‌తిగా ఇచ్చారు. ఇందులో మ‌హీంద్రా స్కార్పియో, టాటా పంచ్ వంటి ఖ‌రీదైన కార్లు ఉన్నాయి. ఇక గ‌త క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఆరుగురు ఉద్యోగులకు నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీలను అందజేశారు. 2024లో 15 కార్లు, 2023లో 12 కార్లను ఉద్యోగుల‌కు దీపావ‌ళి బోన‌స్‌గా ఉచితంగా అంద‌జేశారు. ఈ ప‌థ‌కం ప్రారంభించిన తొలినాళ్ల‌లో కంపెనీ పేరిటే కార్లు కొనుగోలు చేసేవారు. ఆ త‌ర్వాత నేరుగా ఉద్యోగుల పేరిట రిజిస్ట‌ర్ చేయ‌డం ప్రారంభించిన‌ట్లు సంస్థ తెలిపింది.

ఎవ‌రీ ఎం.కె. భాటియా..?

ఎం.కె. భాటియా.. 'మిట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్' వ్యవస్థాపకుడు. ఆయన నేతృత్వంలోని మిట్స్ గ్రూప్ ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఈ-కామర్స్ తదితర రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది. 2002లో తన మెడికల్ స్టోర్ నష్టాల్లో కూరుకుపోవ‌డంతో ఆయ‌న పూర్తిగా దివాలా తీశారు. అయిన‌ప్ప‌టికీ ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించి 2015లో 'మిట్స్ గ్రూప్'ను స్థాపించి విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ప్ర‌స్తుతం ఈ గ్రూపు 12 కంపెనీల‌ను నిర్వ‌హిస్తూ వంద‌లాది మందికి ఉపాధి క‌ల్పిస్తోంది. భాటియా.. ప్రస్తుతం పంచకుల కేంద్రంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు.

త‌న సంస్థ విజ‌యంలో ఉద్యోగుల‌దే కీల‌క పాత్ర అని భాటియా బ‌లంగా న‌మ్ముతారు. అందుకే వారి శ్ర‌మ‌, అంకిత‌భావానికి గుర్తింపుగా కార్ల‌ను గిఫ్ట్‌గా ఇస్తున్న‌ట్లు ఒక సంద‌ర్భంలో చెప్పారు. ఈ కార్లు కేవ‌లం దీపావ‌ళి కానుక‌లు మాత్ర‌మే కాద‌ని.. కంపెనీపై ఉద్యోగులు చూపించిన విశ్వాసానికి, నిబద్ధతకు బహుమతులు అని చెప్పుకొచ్చారు.

Also Read..

పెట్రోల్‌లో ఇథ‌నాల్ శాతాన్ని 20%కి మించి పెంచే ఆలోచ‌న లేదు : కేంద్ర మంత్రి

రూపాయిని కాపాడేందుకు నిల్వలు ఖర్చు చేయొద్దు: రఘురామ్ రాజన్

డిసెంబ‌ర్ 9న 1.90 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్లు పంపిణీ

Advertisement
Advertisement