Supreme Court | శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం.. పిటిషన్లను విచారించనున్న సుప్రీంకోర్టు
Supreme Court | కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి (Sabarimala temple) అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలో విచారణ చేపట్టనుంది.
Supreme Court | కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి (Sabarimala temple) అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలో విచారణ చేపట్టనుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. ఇందుకోసం తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది.
అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని (Sabarimala women entry) అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆ తీర్పును పునఃసమీక్షించాలంటూ కొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలా దాదాపు 67 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు మహిళల ప్రవేశంపై నిషేధం అమలులో ఉన్న వివిధ మతపరమైన ప్రదేశాల విషయంలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ మార్చి 14లోపు లిఖితపూర్వక నివేదికలు సమర్పించాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయాలు, ప్రార్థనా స్థలాల నిర్వాహకులను కోర్టు ఆదేశించింది.
ఈ పిటిషన్లపై విచారణ కోసం ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 22 వరకు రెండు వారాల సమయాన్ని కేటాయింయించింది. శబరిమల అంశంతో పాటు దర్గాలు, మసీదుల్లో ముస్లిం మహిళలకు ప్రవేశం కల్పించాల్సిన అంశం, ఇతర మతాలకు చెందిన వారిని వివాహం చేసుకున్న పార్సీ మహిళలకు మతపరమైన ప్రాంగణాల్లో ప్రవేశం నిరాకరించడం వంటి విషయాలపై కూడా కోర్టు సమగ్రంగా విచారణ జరపనుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






