త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ilaiyaraaja | కాపీ రైట్ వివాదం కేసు.. ఢిల్లీ హైకోర్టులో మ్యూజిక్ మాస్ట్రో ఇళ‌య‌రాజాకు షాక్‌..!

Ilaiyaraaja | ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. 134 సినిమాలకు సంబంధించిన పాటల యాజమాన్య హక్కుల విషయంలో గతంలో జారీ చేసిన మధ్యంతర నిషేధాజ్ఞలను ఎత్తివేయాలని ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.

P

Entertainment | Published On Jul 1, 2026, 8.20 pm IST

Ilaiyaraaja | కాపీ రైట్ వివాదం కేసు.. ఢిల్లీ హైకోర్టులో మ్యూజిక్ మాస్ట్రో ఇళ‌య‌రాజాకు షాక్‌..!
Advertisement

Ilaiyaraaja | ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. 134 సినిమాలకు సంబంధించిన పాటల యాజమాన్య హక్కుల విషయంలో గతంలో జారీ చేసిన మధ్యంతర నిషేధాజ్ఞలను ఎత్తివేయాలని ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర య‌థావిధిగా కొన‌సాగ‌నున్నాయి. కాపీరైట్ వివాదంలో ప్రముఖ సంగీత సంస్థ సారేగామా తన వాదనలను కోర్టు ముందు వినిపించింది. 134 చిత్రాల్లోని పాటలపై చట్టబద్ధమైన కాపీరైట్ హక్కులు తమకే ఉన్నాయని సంస్థ పేర్కొంది. ఒప్పందాల ప్రకారమే ఆయా హక్కులను పొందామని స్పష్టం చేసింది. మరోవైపు, తాను స్వరపరిచిన పాటలకు తనకూ హక్కులు ఉంటాయని ఇళయరాజా వాదిస్తున్నారు.

సినిమాలకు సంగీతం అందించడంలో తన పాత్ర కీలకమని, తాను రూపొందించిన సంగీతంపై ఇతరులకు మాత్రమే పూర్తి హక్కులు ఉండటం స‌రైంది కాదని వాదిస్తూ వ‌స్తున్నారు. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య కొంతకాలంగా న్యాయపరమైన పోరాటం కొనసాగుతోంది. మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. ప్రస్తుత దశలో ఆ ఆదేశాల్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. కేసు పూర్తిస్థాయిలో విచారణకు వచ్చి తుది నిర్ణయం వెలువడే వరకు ప్రస్తుతం ఉన్న ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. భారతీయ సినీ సంగీత రంగంలో ఒకేసారి ఇన్ని సినిమాల పాటల హక్కులపై వివాదం రావడం అరుదైన పరిణామంగా భావిస్తున్నారు. ఈ కేసులో వెలువడే తుది తీర్పు భవిష్యత్తులో మ్యూజిక్ హక్కులు, కాపీరైట్ చట్టాల అమలుపై ప్రభావం చూపే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement