త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఉచిత ప‌థ‌కాలు ఎందుకు..? ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించండి : సుప్రీం కోర్టు

Supreme Court | రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టిస్తున్న ఉచిత ప‌థ‌కాల‌పై (Freebies) దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court)ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

D

National | Published On Feb 19, 2026, 1.51 pm IST

Supreme Court | ఉచిత ప‌థ‌కాలు ఎందుకు..? ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించండి : సుప్రీం కోర్టు
Advertisement

Supreme Court | రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టిస్తున్న ఉచిత ప‌థ‌కాల‌పై (Freebies) దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court)ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప‌లు పార్టీలు ఉచిత సంస్కృతి (freebie culture)ని ప్ర‌చారం చేస్తున్నాయ‌ని మండిప‌డింది. ఉచిత ప‌థ‌కాలు ఆర్థిక అభివృద్ధికి ఆటంకం క‌లిగిస్తాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అలాంటి విధానాల‌ను పునఃప‌రిశీలించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని వ్యాఖ్యానించింది.

ఉచిత విద్యుత్తు ఇస్తామ‌ని త‌మిళ‌నాడు ఎల‌క్ట్రిసిటీ బోర్డు దాఖ‌లు (Tamil Nadu Power Distribution Corporation Ltd) చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, విపుల్ పంచోలితో కూడిన ధ‌ర్మాస‌నం ఈ వ్యాఖ్య‌లు చేసింది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని ప‌ట్టించుకోకుండా, వినియోగ‌దారుల‌కు ఎలా ఉచిత విద్యుత్తును అందిస్తార‌ని కోర్టు ప్ర‌శ్నించింది. అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని పేర్కొంది. భూస్వాములు కూడా ఉచిత విద్యుత్‌ పొందుతున్నారని అభిప్రాయ‌ప‌డింది.

"దేశంలోని చాలా రాష్ట్రాలు ఆర్థిక లోటులో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ అభివృద్ధిని విస్మ‌రిస్తూ ఉచితాల‌ను అందిస్తున్నాయి. ఉచితాల వ‌ల్ల దేశ ఆర్థికాభివృద్ధి దెబ్బ‌తింటుంది. రాష్ట్రాల ఆదాయం జీతాలు, ఉచితాల‌కే స‌రిపోతుంది. ఈ సమస్య ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి. ఉచితాల వ‌ల్ల ఉన్న వ‌న‌రుల‌ను పంచే బ‌దులు.. నిరుద్యోగ ప‌థ‌కాలు వంటి ప్ర‌జ‌ల జీవితాల‌ను మెరుగుప‌రిచే ప్ర‌ణాళిక‌బ‌ద్ద‌మైన విధానాల‌ను ప్ర‌వేశ‌పెడితే బాగుంటుంది. ఉచితంగా ఆహారం, సైకిళ్లు, విద్యుత్తుల‌ను ఇచ్చే బదులు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల‌ క‌ల్ప‌న‌పై దృష్టి పెట్టాలి" అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేర‌కు ఉచిత విద్యుత్తు ఇచ్చే అంశంలో డీఎంకే ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది. దీనిపై నాలుగు వారాల్లో స‌మాధానం చెప్పాల‌ని ఆదేశించింది.

Advertisement
Advertisement