Supreme Court | 2027 జనగణనలో కుల నమోదుపై సుప్రీంకోర్టులో పిల్.. విచారణకు నిరాకరించిన న్యాయస్థానం..!
Supreme Court | జనాభా గణన 2027లో పౌరుల కులాన్ని నమోదు చేసేందుకు అనుసరించే ప్రశ్నిస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. పిటిషనర్, విద్యావేత్త ఆకాశ్ గోయల్ పిల్‌లో చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, జనగణన రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. కుల సమాచారాన్ని గుర్తించేందుకు ముందుగా నిర్ణయించిన డేటా లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Supreme Court | జనాభా గణన 2027లో పౌరుల కులాన్ని నమోదు చేసేందుకు అనుసరించే ప్రశ్నిస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. పిటిషనర్, విద్యావేత్త ఆకాశ్ గోయల్ పిల్‌లో చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, జనగణన రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. కుల సమాచారాన్ని గుర్తించేందుకు ముందుగా నిర్ణయించిన డేటా లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
సీజేఐ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. కుల గణాంకాలను గుర్తించేందుకు ముందుగానే నిర్ణయించిన డేటా ఏదీ లేదని స్పష్టం చేసింది. జనగణన మొత్తం ప్రక్రియ 1958 జనగణన చట్టం, 1990 నియమావళి ఆధారంగా నడుస్తుందని పేర్కొంది. ఈ చట్టాల ప్రకారం జనగణన నిర్వహణ విధానం, సేకరించాల్సిన అంశాలను సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని తెలిపింది. కుల గణనలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా, విషయ నిపుణుల సహకారంతో పటిష్టమైన వ్యవస్థను అధికారులు రూపొందిస్తారని తమకు పూర్తి నమ్మకం ఉందని సుప్రీంకోర్టు వెల్లడించింది. పిటిషనర్ లేవనెత్తిన కొన్ని అంశాలు ఇప్పటికే రిజిస్ట్రార్ జనరల్ దృష్టికి తీసుకెళ్లినట్లు కోర్టు గుర్తించింది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేస్తూ.. అందులో పేర్కొన్న సూచనలు పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
2027లో జరిగే జనగణన జరుగనున్నది. ఇది దేశంలో 16వ జాతీయ జనగణనగా నిలవనుంది. 1931 తర్వాత తొలిసారిగా సమగ్ర కుల జనగణన జరగనుండటం విశేషం. అలాగే, ఇది దేశంలోనే తొలి పూర్తి డిజిటల్ జనగణన కానుండడం డేటా సేకరణ, విశ్లేషణలో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ పిటిషన్‌ను విద్యావేత్త ఆకాశ్ గోయల్ దాఖలు చేయగా.. సీనియర్ న్యాయవాది ముక్తా గుప్తా ఆయన తరఫున వాదనలు వినిపించారు. కుల సంబంధిత వివరాల సేకరణ, వర్గీకరణ, ధ్రువీకరణకు ఉపయోగించే ప్రశ్నావళిని ప్రజలకు వెల్లడించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. పౌరుల కుల గుర్తింపునకు అనుసరించే ప్రమాణాలను ఇప్పటివరకు జనగణన కార్యాలయం వెల్లడించలేదని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






