త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | నా కోర్టులో ఈ ప్ర‌వ‌ర్త‌న‌ను స‌హించ‌ను.. న్యాయ‌వాదికి సీజేఐ వార్నింగ్‌

Supreme Court | ఓ కేసు విచార‌ణ స‌మ‌యంలో న్యాయ‌వాది వ్య‌వ‌హ‌రించిన దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దురుసు ప్ర‌వ‌ర్త‌న‌ను స‌హించ‌బోన‌ని హెచ్చ‌రించారు.

P

National | Published On Feb 23, 2026, 5.35 pm IST

Supreme Court | నా కోర్టులో ఈ ప్ర‌వ‌ర్త‌న‌ను స‌హించ‌ను.. న్యాయ‌వాదికి సీజేఐ వార్నింగ్‌
Advertisement

Supreme Court | ఓ కేసు విచార‌ణ స‌మ‌యంలో న్యాయ‌వాది వ్య‌వ‌హ‌రించిన దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దురుసు ప్ర‌వ‌ర్త‌న‌ను స‌హించ‌బోన‌ని హెచ్చ‌రించారు. న్యాయవ్యవస్థలోని కొలీజియం వ్యవస్థను సవాల్ చేస్తూ.. న్యాయమూర్తుల నియామకం కోసం జాతీయ న్యాయ నియామక కమిషన్‌ను అమలు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖ‌లు చేసిన‌ట్లు సీనియ‌ర్ న్యాయ‌వాది మాథ్యూస్ నెడుంపారా సీజేఐ బెంచ్‌కు తెలిపారు. అలాంటి పిటిష‌న్ ఏదీ న‌మోద‌వ‌లేద‌ని సీజేఐ తెలిపారు. దాంతో న్యాయ‌వాది నెడుంపారా అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ.. "అదానీ, అంబానీల కోసం రాజ్యాంగ బెంచ్‌లు ఏర్ప‌డ్డాయి.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ఇక్క‌డ విన‌ప‌డ‌వు" అన్నారు. ఈ వ్యాఖ్య‌లతో సీజేఐ ఆగ్ర‌హానికి గురై.. న్యాయ‌వాదిని హెచ్చ‌రించారు.

"మిస్టర్ నెడుంపారా.. మీరు నా కోర్టులో ఏం మాట్లాడుతున్నారో జాగ్ర‌త్త‌గా ఆలోచించండి. మీరు నన్ను చండీగఢ్‌, ఢిల్లీ కోర్టుల్లో చూశారు. మీరు ఇతర బెంచ్‌లతో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లుగా నా కోర్టులో దురుసుగా ప్ర‌వ‌రిస్తాన‌ని అనుకోకండి. నేను మిమ్మ‌ల్ని హెచ్చ‌రిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు. 2024లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ విభాగం నెడుంపర పిటిషన్‌ను నమోదు చేయడానికి నిరాకరించింది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌పై ఇప్పటికే నిర్ణయం జరిగిందని, మ‌ళ్లీ అదే అంశంపై కొత్త పిటిషన్‌ను విచారించ‌లేమ‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. అయితే, న్యాయ‌వాది నెడుంపార‌పై సీజేఐ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం ఇదే తొలిసారేం కాదు. గ‌తేడాది అప్ప‌టి సీజేఐ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా మంద‌లించారు. న్యాయ‌స్థానంలో రాజ‌కీయ ప్ర‌సంగాలు చేయొద్ద‌ని హిత‌వు ప‌లికారు.

Advertisement
Advertisement