త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sabarimala Case | శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలో మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశంపై సుప్రీంలో మ‌ళ్లీ విచార‌ణ‌..!

Sabarimala Case | శబరిమల ఆలయంతో సహా మతపరమైన ప్రదేశాలలో మహిళలపై వివక్షకు సంబంధించిన అంశాల‌పై దాఖ‌లైన సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం విచార‌ణ ప్రారంభించింది. కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల ఆల‌యంతో సంబంధం ఉన్న కేసులో 2018లో తీర్పుపై ఇచ్చిన రివ్యూ పిటిష‌న్ల‌ను ప‌రిశీలించేందుకు కోర్టు తొమ్మిది మంది న్యాయ‌మూర్తుల‌తో కూడిన రాజ్యాంగ ధ‌ర్మాస‌నాన్ని ఏర్పాటు చేసింది.

P

National | Published On Apr 7, 2026, 5.29 pm IST

Sabarimala Case | శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలో మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశంపై సుప్రీంలో మ‌ళ్లీ విచార‌ణ‌..!
Advertisement
  • ఏడు అంశాల‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ‌
  • మ‌హిళ‌ల‌ను అంట‌రానివారిగా చూడొద్ద‌న్న జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న‌

Sabarimala Case | శబరిమల ఆలయంతో సహా మతపరమైన ప్రదేశాలలో మహిళలపై వివక్షకు సంబంధించిన అంశాల‌పై దాఖ‌లైన సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం విచార‌ణ ప్రారంభించింది. కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల ఆల‌యంతో సంబంధం ఉన్న కేసులో 2018లో తీర్పుపై ఇచ్చిన రివ్యూ పిటిష‌న్ల‌ను ప‌రిశీలించేందుకు కోర్టు తొమ్మిది మంది న్యాయ‌మూర్తుల‌తో కూడిన రాజ్యాంగ ధ‌ర్మాస‌నాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. నెల‌లో మూడురోజుల పాటు మ‌హిళ‌ల‌ను అంట‌రానివారిగా ప‌రిగ‌ణించి.. నాలుగో రోజు నుంచి మ‌ళ్లీ సాధార‌ణంగా చూడ‌డం వంటి విధానం రాజ్యాంగానికి విరుద్ధ‌మ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

2018 శ‌బ‌రిమ‌ల తీర్పుపై కేంద్రం త‌ర‌ఫున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. తీర్పులో ప‌ది నుంచి 50 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సుగ‌ల మ‌హిళ‌ల‌కు ఆల‌యంలోకి నిరాక‌రించ‌డం అంట‌రానిత‌నం కింద‌కే వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా నిషేధించారు. అయితే, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తుషార్ మెహతా.. మహిళలను అంటరానివారిగా చూడటం సరైన దృక్పథం కాదన్నారు. భారతదేశాన్ని పాశ్చాత్య దేశాల మాదిరిగా పూర్తిగా లింగ వివక్షతో కూడిన సమాజంగా చూపించడం తగదన్నారు.

ఈ కేసును విచారిస్తున్న తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్, అన్ని వాదనలు నిర్ణీత గడువులోనే సమర్పించాలని న్యాయవాదులకు స్పష్టం చేసింది. ఇతర కీలక కేసులు కూడా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో అదనంగా సమయం ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈ కేసులో వేగంగా తీర్పును వేగంగా ఇవ్వాల‌నే ఉద్దేశంతో కోర్టు ఆదేశాలు జార చేసింది. మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కుల పరిధి వంటి అంశాలకు సంబంధించిన ఏడు కీలక ప్రశ్నలు ప్రస్తుతం కోర్టు ముందున్నాయి. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 పరిధి, పరిమితులపై స్పష్టత తీసుకురావడమే లక్ష్యంగా విచారణ కొనసాగుతోంది.

సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ సూర్య‌కాంత్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటైన ధ‌ర్మాస‌నంలో న్యాయమూర్తులు నాగరత్నతో పాటు ఎంఎం సుందరేశ్, అహ్సానుద్దీన్ అమానుల్లా, అరవింద్ కుమార్, ఏజీ మసీహ్, ప్రసన్న బీ వరాలే, ఆర్ మహాదేవన్, జోయ్‌మల్యా బాగ్చి ఉన్నారు. 2018లో సుప్రీంకోర్టు తీర్పులు వెలువ‌రించింది. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలో అన్ని వ‌య‌సుల మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం క‌ల్పించింది. ఈ విచారణలో శ‌బరిమల అంశంతో పాటు మత స్వేచ్ఛకు సంబంధించిన ఇతర కీలక విషయాలపై సైతం చర్చ జరిగే అవకాశం ఉంది.

Advertisement
Advertisement