త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu | త‌మిళ‌నాడులో అదే స‌స్పెన్స్‌.. ఎమ్మెల్యేల సంత‌కాలు ఫోర్జ‌రీ చేసిన విజ‌య్‌.. గ‌వ‌ర్న‌ర్‌కు AMMK ఫిర్యాదు

Tamil Nadu | త‌మిళ‌నాడులో (Tamil Nadu) నూత‌న ప్ర‌భుత్వ ఏర్పాటు మ‌రింత ఆల‌స్యం కానుంది. విజ‌య్ ప్ర‌మాణ స్వీకారానికి ఆటంకాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. త‌న‌కు మ‌ద్ద‌తునిచ్చే ఎమ్మెల్యేల సంత‌కాల‌తో కూడిన లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర ఆర్లేక‌ర్‌కు (Governor Rajendra Arlekar) శుక్ర‌వారం సాయంత్రం విజ‌య్ అంద‌జేశారు.

G

National | Published On May 9, 2026, 6.33 am IST

Tamil Nadu | త‌మిళ‌నాడులో అదే స‌స్పెన్స్‌.. ఎమ్మెల్యేల సంత‌కాలు ఫోర్జ‌రీ చేసిన విజ‌య్‌.. గ‌వ‌ర్న‌ర్‌కు AMMK ఫిర్యాదు
Advertisement

Tamil Nadu | త్రినేత్ర‌.న్యూస్‌: త‌మిళ‌నాడులో (Tamil Nadu) నూత‌న ప్ర‌భుత్వ ఏర్పాటు మ‌రింత ఆల‌స్యం కానుంది. విజ‌య్ (Vijay) ప్ర‌మాణ స్వీకారానికి ఆటంకాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. త‌న‌కు మ‌ద్ద‌తునిచ్చే ఎమ్మెల్యేల సంత‌కాల‌తో కూడిన లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర ఆర్లేక‌ర్‌కు (Governor Rajendra Arlekar) శుక్ర‌వారం సాయంత్రం విజ‌య్ అంద‌జేశారు. అయితే కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలు ఇప్ప‌టికే తాము మ‌ద్దతునిస్తున్న‌ట్లు లేఖ‌లు స‌మ‌ర్పించ‌గా, ఇండియ‌న్ యూనియ‌న్ ముస్లిం లీగ్ (IUML), విడుద‌లై చిరుతైగ‌ళ్ క‌ట్చి (VCK) ఇంకా లేఖ‌లు ఇవ్వ‌లేదు. దీంతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు గ‌వ‌ర్న‌ర్ నుంచి అనుమ‌తి రాలేదు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం జ‌ర‌గాల్సిన విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం నిలిచిపోయింది.

మ‌రోవైపు విజ‌య్ స‌మ‌ర్పించిన లేఖ‌లో ఎమ్మెల్యేల సంత‌కాల‌ను ఫోర్జ‌రీ చేశారంటూ ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామి అయిన అమ్మ మ‌క్క‌ల్ మున్నేట్ర క‌ళ‌గం (AMMK) ప్ర‌ధాన కార్య‌దర్శి దినకరన్ (TTV Dhinakaran) ఆరోపించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం రాత్రి 9.30 గంట‌ల స‌మ‌యంలో గవర్నర్‌ ఆర్లేకర్ క‌లిసి ఫిర్యాదు చేశారు. త‌మ‌కున్న ఒకేఒక్క ఎమ్మెల్యే కామరాజర్ టీవీకేకు మద్దతు ఇచి్చనట్టుగా, అత‌ని పేరును కూడా ఆ లేఖ‌లో పేర్కొన్నార‌ని చెప్పారు. న‌యానోభ‌యానో అత‌డిని ఒప్పించ‌వ‌చ్చ‌వ‌చ్చ‌ని అలా చేశార‌ని చెప్పారు. ప్రస్తుతం ఆయన కనిపించకుండా పోయార‌ని, దీన్నిబట్టి తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు బేరాలు సాగుతున్నాయని గవర్నర్‌కు వివరించారు.

విజయ్‌ పదవీ కాంక్షతో ఉన్నారని, తమ ఎమ్మెల్యే అమ్ముడుపోయాడని అనుమానం వ్యక్తం చేశారు. ఇలా ఫోర్జ‌రీలు చేసేవారిని ప్ర‌భుత్వ ఏర్పాటుకు పిలువొద్ద‌ని గ‌వ‌ర్న‌ర్‌కు విన్న‌వించాన‌న్నారు. అదేవిధంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించాలని కోరిన‌ట్టు ఆయ‌న చెప్పారు. పళని స్వామికి సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. ఈ నేప‌థ్యంలో విజయ్‌ ప్రమాణ స్వీకారం సందిగ్ధంలో పడింది.

Advertisement
Advertisement