త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Student Slaps Teacher | ఆల‌స్యంగా ఎందుకొచ్చావని ప్రశ్నించినందుకు.. ఉపాధ్యాయురాలి చెంప చెళ్లుమ‌నిపించాడు..

Student Slaps Teacher | బ్ర‌హ్మా, విష్ణువు, మ‌హేశ్వ‌రుల త‌ర్వాతి స్థానం గురువుదే. మ‌న‌కు విద్యాబుద్ధులు నేర్పి, ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే (Teacher). స‌మాజంలో మ‌న‌కంటూ ఓ గుర్తింపు రావ‌డానికి పాటుప‌డేదీ గురువులే. మ‌రి అలాంటి గురువుపై ఓ విద్యార్థి (Student Slaps Teacher) ముందే చేయిచేసుకున్నాడు. అదీ ప‌రీక్ష‌కు ఎందుకు ఆల‌స్యం అయింద‌ని ప్ర‌శ్నించింనందుకు..

G

National | Published On Feb 8, 2026, 8.45 am IST

Student Slaps Teacher | ఆల‌స్యంగా ఎందుకొచ్చావని ప్రశ్నించినందుకు.. ఉపాధ్యాయురాలి చెంప చెళ్లుమ‌నిపించాడు..
Advertisement

Student Slaps Teacher | త్రినేత్ర‌.న్యూస్‌: గురు బ్ర‌హ్మ గురు విష్ణుః.., గురు దేవో మ‌హేశ్వ‌రః.., గురుర్ సాక్షాత్ ప‌ర‌బ్ర‌హ్మ‌.. త‌స్మైశ్రీగురువే న‌మః... గురువు దైవంతో స‌మానం. బ్ర‌హ్మా, విష్ణువు, మ‌హేశ్వ‌రుల త‌ర్వాతి స్థానం గురువుదే. మ‌న‌కు విద్యాబుద్ధులు నేర్పి, ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే (Teacher). స‌మాజంలో మ‌న‌కంటూ ఓ గుర్తింపు రావ‌డానికి పాటుప‌డేదీ గురువులే. మ‌రి అలాంటి గురువుపై ఓ విద్యార్థి (Student Slaps Teacher) ముందే చేయిచేసుకున్నాడు. అదీ ప‌రీక్ష‌కు ఎందుకు ఆల‌స్యం అయింద‌ని ప్ర‌శ్నించింనందుకు.. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని (Gujarat) పంచ‌మ‌హ‌ల్ (Panchmahal) జిల్లా షేహ్రా ప‌ట్ట‌ణంలో చోటుచేసుకున్న‌ది.

మొహ‌మ్మెద్ ఖాన్ అన్సారీ అనే 18 ఏండ్ల విద్యార్థి షేహ్రా ప‌ట్ట‌ణంలోని ఎస్‌జే దేవ్ హైస్కూల్‌లో 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. గ‌త నెల 24న నిర్వ‌హించిన‌ సెకండ్ ప్రిలిమిన‌ర్ టెస్టుకు చాలా ఆల‌స్యంగా వ‌చ్చాడు. దీంతో ఎందుకు ఆల‌స్య‌మైంద‌ని ప‌రీక్ష హాల్‌లో ఉన్న ఉపాధ్యాయురాలు అత‌డిని ప్ర‌శ్నించారు. ఆగ్ర‌హంతో ఊగిపోయిన అన్సారీ.. స‌హ‌చ‌రుల ముందే ఆమె చెంప ప‌గ‌ల‌గొట్టాడు. నేనేం చేసినా ఇంట్లో ఎవ‌రూ అడ‌గ‌రు. అలాంటిది నువ్వెవ‌రు న‌న్న అడ‌గ‌డానికి? అంటూ టీచ‌ర్‌ను ప్ర‌శ్నించాడు.

మూడు రోజుల త‌ర్వాత అత‌ని తండ్రి, మ‌రో 15-20 మంది స్నేహితుల‌తో క‌లిసి స్కూల్‌కి వ‌చ్చి ఆ టీచ‌ర్‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. టౌన్‌లో నువ్వు ఒక్క‌దానివే ఉంటున్నావు. జాగ్ర‌త్త అంటూ ఉపాధ్యాయురాలిని భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశాడు. దీంతో ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 3న కేసు న‌మోదుచేసిన పోలీసులు.. ఉపాధ్యాయురాలిని కొట్టిన‌ అన్సారీని అరెస్టు చేశారు. అయితే వెంట‌నే అత‌డిని బెయిల్‌పై విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

https://x.com/sathyashrii/status/2020057228963901757

Advertisement
Advertisement