త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | భరతమాతను అమెరికాకు అమ్మేశారు.. సిగ్గుగా లేదూ..? కేంద్ర ప్ర‌భుత్వంపై రాహుల్ ఫైర్‌

Rahul Gandhi | కేంద్ర ప్ర‌భుత్వంపై లోక్‌స‌భ‌ (Lok Sabha)లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

D

National | Published On Feb 11, 2026, 3.22 pm IST

Rahul Gandhi | భరతమాతను అమెరికాకు అమ్మేశారు.. సిగ్గుగా లేదూ..? కేంద్ర ప్ర‌భుత్వంపై రాహుల్ ఫైర్‌
Advertisement

Rahul Gandhi | కేంద్ర ప్ర‌భుత్వంపై లోక్‌స‌భ‌ (Lok Sabha)లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ( India-US trade deal) ఓ 'లొంగుబాటు' చ‌ర్య‌గా రాహుల్‌ అభివర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా భారత ప్రయోజనాలను పూర్తిగా అమెరికాకు తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు. భరతమాతను అమెరికాకు అమ్మేశారని.. ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా..? అంటూ ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

రైతుల‌కు న‌ష్టం..

లోక్‌స‌భ‌లో రాహుల్ ప్ర‌సంగిస్తూ.. అమెరికా టారిఫ్‌ల‌తో దేశ రైతాంగానికి తీర‌ని న‌ష్టం వాటిల్లుతుంది. అమెరికాలోని కొన్ని ఉత్ప‌త్తుల‌కు మోదీ ప్ర‌భుత్వం గేట్లు తెరిచింది. దీంతో రైత‌న్న‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతారు. అమెరికా టారిఫ్‌ల‌తో టెక్స్ టైల్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతుంది. అనేక మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. పార్టీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కోసమే టారిఫ్‌ల‌కు మోదీ ఒప్పుకున్నారు. దేశ ఇంధన భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడింది. చమురు ఎవరి నుండి కొనుగోలు చేయాలో కూడా అమెరికానే నిర్ణయించే స్థితికి మనం చేరుకున్నాం అంటూ రాహుల్‌ దుయ్యబట్టారు.

18 శాతానికి ఎందుకు పెరిగింది..?

2025కి ముందు 3 శాతం ఉన్న టారిఫ్ ఇప్పుడు 18 శాతానికి ఎందుకు పెరిగిందో ప్ర‌ధాని మోదీ స‌మాధానం చెప్పాల‌ని రాహుల్ డిమాండ్ చేశారు. అమెరికా దిగుమ‌తుల‌ను 46 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 100 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెంచిన‌ట్లు తెలిపారు. అమెరికాతో కుదిరిన ఈ వాణిజ్య ఒప్పందం భార‌త్‌కు ఎలాంటి భ‌రోసా ఇవ్వ‌డం లేద‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంతో అమెరికాకే మేలు చేకూరుస్తుంద‌న్నారు.

Advertisement
Advertisement